Begin typing your search above and press return to search.
వాల్ స్ట్రీట్ జర్నల్ ఇంటర్వ్యూలో మోడీ కీలక వ్యాఖ్యలు!
By: Tupaki Desk | 20 Jun 2023 8:24 PM GMTప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ... అమెరికా పర్యటనకు బయల్దేరే ముందు వాల్ స్ట్రీట్ జర్నల్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పలు కీలక, ఆసక్తికర విషయాలు వెళ్లడించారు. ఈ సందర్భంగా రష్యా - ఉక్రెయిన్ యుద్దం విషయంలో భారత వైఖరిని స్పష్టం చేస్తూనే... స్వాతంత్రం వచ్చిన తర్వాత పుట్టిన తొలి ప్రధాని తానే అని తెలిపారు.
ఉక్రెయిన్ పై ఏడాదికి పైగా రష్యా సాగిస్తున్న దండయాత్ర విషయంలో భారత్ తటస్థ వైఖరి అవలంబిస్తోందంటూ పశ్చిమ దేశాలు ఆరోపిస్తున్నాయి. అయితే ఈ విషయాలపై తాజాగా భారత ప్రధాని మోడీ స్పందించారు.
ఈ విషయంలో తామెప్పుడూ తటస్థ వైఖరి అవలంభించలేదని, తమెప్పుడూ శాంతివైపే ఉంటామంటూ వ్యాఖ్యానించారు. అనంతరం... భారత్-చైనా సంబంధాలు, భారత్-అమెరికా సంబంధాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.
తాజాగా రష్యా - ఉక్రెయిన్ యుద్దంపై స్పందించిన మోడీ... అంతర్జాతీయ చట్టాలను ప్రతి దేశం గౌరవించాలని.. దౌత్యపరమైన మార్గాలు, చర్చల ద్వారా మాత్రమే వివాదాలను పరిష్కరించుకోవాలి తప్ప యుద్ధంతో కాదని చెబుతూ... తామెప్పుడూ శాంతివైపే ఉంటామని అన్నారు. ఇదే సమయంలో... సమస్య పరిష్కారం కోసం రష్యా, ఉక్రెయిన్ దేశాల అధినేతలు పుతిన్, జెలెన్ స్కీతో పలుమార్లు మాట్లాడినట్లు మోడీ గుర్తుచేశారు.
"ద్వైపాక్షిక బంధాలు నిలబడాలంటే.. సరిహద్దు ప్రాంతాల్లో శాంతియుత, నిశ్చలమైన పరిస్థితులు చాలా ముఖ్యం. వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవడంపై మాకు విశ్వాసం ఉంది. అదే సమయంలో.. భారత్ తన గౌరవాన్ని, సార్వభౌమత్వాన్ని కాపాడుకునేందుకు సంసిద్ధంగా ఉంది" అని భారత్ - చైనా మధ్య సంబంధాలపై మోడీ స్పందించారు.
ఇదే సమయంలో భారత్ - అమెరికా మధ్య బంధం మునుపటి కంటే మరింత బలంగా ఉందని చెప్పిన మోడీ.. ఇరు దేశాల నేతల మధ్య అమితమైన విశ్వాసం ఉందని అన్నారు.
ఇదే సమయంలో... స్వాతంత్ర్య భారతదేశంలో పుట్టిన తొలి ప్రధానమంత్రిని తానే అని తెలిపిన మోడీ... తన ఆలోచనా విధానాలు, ప్రవర్తన అన్నీ దేశ చరిత్ర, సంప్రదాయాల నుంచి ప్రేరణ పొందినట్లుగానే ఉంటాయని తెలిపారు.
కాగా... ప్రధాని మోడీ నేడు అమెరికా పర్యటనకు బయల్దేరారు. బుధవారం నుంచి ఆయన అమెరికాలో ర్యటించనున్నారు.