Begin typing your search above and press return to search.
మోడీ కంటే కేసీఆర్ దే పెద్ద మనసు!
By: Tupaki Desk | 17 Aug 2018 5:42 PM GMTతెలంగాణ ముఖ్యమంత్రి - టీఆర్ ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తన పెద్ద మనసును చాటుకున్నారు. సహజంగా భారీగా ఆలోచించి...భారీగా పనులు చేసే కేసీఆర్ దాతృత్వంలో కూడా తన ఉదారతను అంతే భారీగా చేశారు. ఇదంతా వరదలతో అతలాకుతలమైన కేరళకు సహాయం చేయడం విషయంలో. భారీ వర్షాలు - వరదలతో ఇబ్బంది పడుతున్న కేరళ రాష్ట్రానికి రూ. 25 కోట్లను తెలంగాణ తరఫున తక్షణ సహాయంగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రకటించారు. వెంటనే ఈ డబ్బులను కేరళ రాష్ట్రానికి అందించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషిని ఆదేశించారు. వరదల వల్ల జల కాలుష్యం జరిగినందున నీటిని శుద్ది చేసేందుకు రెండున్నర కోట్ల విలువైన ఆర్వో మిషిన్లను కేరళకు పంపాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.ఈ మొత్తం కేంద్రం కంటే ఎక్కువ కావడం విశేషం. ప్రధాని మోడీ కేరళకు కేవలం రూ. 100 కోట్లు మాత్రమే ప్రకటించారు. కేంద్రంతో పోలిస్తే...కేసీఆర్ దే పెద్ద మనసని పేర్కొంటున్నారు.
కేరళ రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్నందున వారిని ఆదుకోవాల్సిన కర్తవ్యం తోటి రాష్ట్రంగా మనకుందని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని పారిశ్రామిక వేత్తలు - ఐటీ రంగ ప్రముఖులు - వ్యాపార వాణిజ్య వేత్తలు - ఇతర రంగాల వారు ఇతోదిక సహాయం అందించడానికి ముందుకు రావాలని సీఎం పిలుపునిచ్చారు. సిఎం రిలీఫ్ ఫండ్ కు విరాళాలు అందిస్తే వాటిని తక్షణం కేరళ రాష్ట్రానికి పంపే ఏర్పాటు చేసినట్లు ముఖ్యమంత్రి చెప్పారు. కేరళ రాష్ట్రంలో సంభవించిన ప్రకృతివైపరిత్య వల్ల ప్రాణ - ఆస్థి నష్టం జరగడం పట్ల ముఖ్యమంత్రి తీవ్ర విచారం వ్యక్తం చేసారు. ఈ విపత్తు నుండి కేరళ రాష్ట్రం త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. తెలంగాణ తరఫున అవసరమైన సహాయం అందించడానికి సిద్ధంగా ఉన్నట్లు సీఎం ప్రకటించారు.
కాగా, ఈ సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో కేంద్రం తీరుపై చర్చ జరుగుతోంది. రాష్ట్రాల నుంచి పన్నుల రూపంలో వచ్చే నిధులలో 57 శాతం తన వద్ద ఉంచుకునే కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్రాలు ప్రకృతి విపత్తులు ఎదుర్కొన్న సమయంలో ఆదుకునేందుకు ప్రత్యేకంగా ఓ నిధిని నిర్వహిస్తుంది. అలాంటి ఏర్పాటు ఉన్నప్పటికీ జలవిలయంతో అతలాకుతలం అవుతున్న కేరళ విషయంలో ప్రధాని మోడీ తన ఉదారతను చాటుకోలేదంటున్నారు. కాగా, గతంలో విశాఖను హుదూద్ వణికించినప్పుడు కూడా రూ.1000 తక్షణ సాయంగా ప్రకటించి రూ.450 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని పలువురు గుర్తు చేసుకుంటున్నారు.