Begin typing your search above and press return to search.

మోడీ ఉమ్మడి పౌర స్మృతి అస్త్రం 2024 ఎన్నికల కోసం...?

By:  Tupaki Desk   |   30 Jun 2023 9:00 AM GMT
మోడీ ఉమ్మడి పౌర స్మృతి అస్త్రం 2024 ఎన్నికల కోసం...?
X
మోడీ ఎన్నికల కు ముందు ఒక అస్త్రాన్ని బయటకు తీశారు కామన్ సివిల్ కోడ్. తెలుగు లో ఉమ్మడి పౌర స్మృతిగా చెప్పే ఈ ఆయుధం బీజేపీ ని 2023 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీని ఒడ్డెక్కిస్తుందా అన్నది ఇపుడు చర్చగా ఉంది. సార్వత్రిక ఎన్నికల కు తొమ్మిది నెలల సమయం ఉంది. సడెన్ గా కామన్ సివిల్ కోడ్ అంటోంది బీజేపీ ప్రభుత్వం.

నిజానికి బీజేపీ అమ్ముల పొది లో ఈ అస్త్రం భద్రంగానే ఉంది. దాన్ని మూడవసారి అధికారం లోకి వస్తే బయట కు తీయాలనుకుంది. కానీ ముందే ఆ అవసరం వచ్చి పడింది. ఉమ్మడి పౌర స్మృతి తో ఈసారి ఎన్నికల గోదారి ని ఈదాల ని బీజేపీ భావిస్తోంది. ఈ దేశంలో మొత్తం జనాభా 142 కోట్లకు పై దాటి ఉన్నారు.

ఇందులో అందరికీ ఒక చట్టం లేదు. ముఖ్యంగా జనాభా నియంత్రణ వంటి చట్టాలు ఒక వర్గానికి వర్తించే అవకాశం లేదు. దాంతో ఆ వర్గం జనాభా అధికంగా పెరుగుతుందని ఆందోళన హిందూ సంస్థల లో మొదలైంది. అదే కనుక అలా వదిలేస్తే ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి వందేళ్ళు అయ్యే నాటికి అంటే 2047 నాటికి దేశం లో ఒక వర్గం జనాభా విపరీతంగా పెరిగి మరో కీలకమైన వర్గం మైనారిటీలు మారుతారు అన్న కలవరం కూడా ఉంది.

దాంతో పాటు ఇతర కారణాల రిత్యా కూడా ఉమ్మడి సివిల్ కోడ్ ని ఇపుడు దేశంలో ప్రవేశపెట్టాల ని బీజేపీ భావిస్తోంది. ఇంత పెద్ద దేశానీకి ఒకే చట్టం ఒకే న్యాయం లేకపోతే ఎలా అన్నదే బీజేపీ పెద్దల వాదన. ఇదిలా ఉంటే జనసేన పూర్వ రూపం జన సంఘ్ కి కూడా ఇదే ఆశయం. మూల సిద్ధాంతాల్లోనే ఉంది.

నాడు దేశ విభజన జరిగినపుడు ఆప్షన్ ఇవ్వకుండా కేవలం హిందువులకే భారత్ ఉండేలా చేయాలని కూడా అప్పట్లో ఒక వర్గం నుంచి డిమాండ్లు వచ్చాయి. ఐపుడు పెద్దలు అలా చేయకుండా బుజ్జగింపు చర్యల కు దిగారని దాని ఫలితమే ఇందాకా కధ నడిచింది అన్నది ఒక వాదన.

ఇక బీజేపీ పూర్వ రూపం జనసంఘ్ 1951లో ఏర్పాటు అయితే అది తొలిసారి అధికారం చెపట్టేసరికి 45 అయిదేళ్ళు పట్టింది. 1996లో బీజేపీ మొదటిసారి అధికారం లోకి వచ్చింది. కానీ పదమూడు రోజులే ఉంది. 1998లో వస్తే పదమూడు నెలలు ఉంది. 1999లో గెలిచినా నాలుగున్నరేళ్ళు ఉంది. పైగా పాతిక పార్టీలతో దోస్తీ అందుకే కీలకమైన తన అజెండా ను బయట కు తీయలేకపోయారు.

ఇక 2014లో బీజేపీ ఫుల్ మెజారిటీ తో నరేంద్ర మోడీ నాయకత్వంలో అధికారం లోకి వచ్చింది. తొలి టెర్మ్ లో కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. అలా సాకారం అయిన వాటి లో రామ మందిరం వంటివి ఉన్నాయి. రెండవ సారి అధికారం లోకి వచ్చిన తరువాత కాశ్మీర్ కి ఇచ్చిన ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేస్తూ బీజేపీ కీలకమైన నిర్ణయం తీసుకుంది.

ఇక ఇపుడు ఉమ్మడి పౌర స్మృతి మీద దృష్టి పెట్టింది. తొందరలోనే దీన్ని చట్టంగా చేయాలనుకుంటోంది. అలా చేయడం వల్ల మెజారిటీ హిందూ ఓట్లను పోలరైజ్ చేస్తూ తమ అధికారాన్ని మరోసారి నిలబెట్టుకోవచ్చు అన్నది బీజేపీ ఎత్తుగడగా ఉంది. అయితే దీని మీద విపక్షాలు రాధ్ధాతం మొదలెట్టాయి. డీఎంకే అయితే కామన్ సివిల్ కోడ్ ని హిందువులకే వర్తింపచేయండి అంటూ బీజేపీకి సలహా ఇచ్చింది.

ఆప్ మాత్రం బీజేపీ కి మద్దతు ఇచ్చింది. కామన్ సివిల్ కోడ్ కి తమ మద్దతు ఉంటుందని, అయితే అందరితో చర్చించి ఏకాభిప్రాయనికి రావాలని కోరింది. మరో వైపు చూస్తే ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ అయితే బీజేపీ మీద తీవ్ర విమర్శలు చేశారు. బీజేపీ కి ఆదరణ బాగా తగ్గిపోతోంది కాబట్టే ఇలాంటివి చేస్తున్నారు అని అంటున్నారు.

ప్రజల దృష్టిని మరల్చే క్రమంలోనె ఇలా చేస్తున్నారు అని నిందించారు. ఈ బిల్లు కంటే ముందు మహిళలకు రిజర్వేషన్ ఇచ్చే బిల్లుని చట్టబద్ధం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఇక బీజేపీ కి కావాల్సింది ఇదే. విపక్షాలు ఎటూ ఈ బిల్లుకు అంగీకరించవు. వారిని మైనారిటీల బుజ్జగింపు పార్టీలు గా ముద్ర వేయించి తాము హిందూ ఉద్ధరణ ఏకైక పార్టీగా చెప్పుకుని హిందూ కార్డుతో 2024 ఎన్నికల్లో మరోమారు గెలవడానికి బీజేపీ చూస్తోంది అని అంటున్నారు.