Begin typing your search above and press return to search.
మోడీ జపాన్ టూర్.. ఒక హగ్.. మిగిలిన వారికి షేక్ హ్యాండ్.. చర్చలు
By: Tupaki Desk | 21 May 2023 10:26 AM GMTజపాన్ వేదికగా జరుగుతున్న జీ7 శిఖరాగ్ర సదస్సుకు హాజరైన ప్రధాని నరేంద్ర మోడీ బిజీబిజీగా గడిపారు.వరుస పెట్టి.. ఈ సదస్సుకు హాజరైన సభ్య దేశాల అధినేతలతో ద్వైపాక్షిక చర్చలు నిర్వహించారు. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. ఈ సదస్సుకు హాజరైన బ్రిటన్ ప్రధాని రిషి సునక్ ను కలిసిన సందర్భంలో ఆయన్ను ఆత్మీయ ఆలింగనం చేసుకోవటం అందరిని ఆకర్షించింది. ఒకే దేశానికి చెందిన వ్యక్తులు.. రెండు దేశాలకు ప్రధానులుగావ్యవహరించటం విశేషంగా చెప్పాలి.
రెండో ప్రపంచ యుద్ధంలో అణుబాంబు దాడికి గురైన హిరోషిమా నగరంలో జరుగుతున్న సదస్సు సందర్భంగా.. దీనికి హాజరైన వివిధ దేశాకలు చెందిన అధ్యక్షులుతో ప్రధాని మోడీ భేటీ అయ్యారు.
- ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ
- ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్
- ఇండోనేసియా అధ్యక్షుడు జోకో విడోడో
- జపాన్ ప్రధాని ఫ్యూమియో కిషిదా
- దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్
- వియత్నాం ప్రధాని ఫామ్‌మిన్ చిన్ లతో వేర్వేరుగా సమావేశమయ్యారు. వీరితోపాటు ఐక్యరాజ్యయ సమితి చీఫ్ ఆంటోనియో గుటెరెస్‌ను కలిశారు. సదస్సులో మాట్లాడిన మోడీ వ్యాఖ్యల్లో ముఖ్యమైన అంశాల్నిచూస్తే..
+ ప్రపంచంలోని నిరుపేద ప్రజలకు ప్రాధాన్యత ఇస్తూ.. సమ్మిళిత ఆహార వ్యవస్థను నిర్మించాలి.
+ ఆహార ఉత్పాదకతకు కీలకమైన ఎరువుల వనరులపై గుత్తాధిపత్యం చెలాయించే విస్తరణవాద ధోరణిని సరి చేయాలి.
+ ఎరువుల సరఫరా చెయిన్ మెరుగుపడాలి. దానికి అడ్డుగా ఉన్నరాజకీయ అడ్డంకుల్ని తొలగించాలి
- డెవలప్ మెంట్.. టెక్నాలజీ.. ప్రజాస్వామ్యంపై ఏకకాలంలో ఫోకస్ చేసి పని చేయాలి.
+ సహజ వనరుల సమగ్ర వినియోగం అవసరం చాలా ముఖ్యం. చిన్న.. సన్నకారు రైతుల శ్రేయస్సుకోసం పని చేయాలి.
+ సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి. ఎరువులకు ప్రత్యామ్నాయ వ్యవస్థను తీసుకురావాలి.
+ త్రణ ధాన్యాల సాగుతో పోషకాహార లోపం.. వాతావరణ మార్పులు లాంటి అనేక సమస్యల నుంచి బయటపడొచ్చు.
ఈ సదస్సులో భాగంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీని కలిసిన సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్ యుద్దం తర్వాత ఈ ఇద్దరునేతలు ముఖాముఖిన కలవటం ఇదే తొలిసారి. ఉక్రెయిన్ - రష్యా వివాదాన్ని మానవత్వానికి సంబంధించిన సమస్యగా అభివర్ణిస్తూ.. దీనికి పరిష్కారం కనుగొనేందుకు భారత్ తరఫున.. వ్యక్తిగతంగానూ తాను ప్రయత్నిస్తానని చెప్పటం గమనార్హం.
ఉక్రెయిన్ యుద్దం మొత్తం ప్రపంచానికే పెద్ద సమస్యగా పేర్కొన్న మోడీ.. అన్ని దేశాల్ని అనేక రకాలుగా ప్రభావితం చేసిందన్నారు. తాను ఈ అంశాన్ని రాజకీయ, ఆర్థిక సమస్యగా పరిగణించలేదని.. దీన్ని మానవత్వం.. మానవ విలువలకు సంబంధించిన సమస్యగా భావించినట్లు చెప్పారు. యుద్ధ బాధలు తమ అందరికంటే మీకే ఎక్కువ తెలుసంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడితో మాట్లాడిన మోడీ.. 'ఉక్రెయిన్ నుంచి తిరిగి వచ్చిన భారత విద్యార్థులు నాకు మీ వద్ద ఉన్న పరిస్థితుల్ని వివరించారు. మీ ప్రజల వేదనను బాగా అర్థం చేసుకోగలిగా. ఈ సమస్యను పరిష్కరించేందుకు సాధ్యమైనంతగా ప్రయత్నిస్తానని హామీ ఇస్తున్నా' అని చెప్పారు.
ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ తో భేటీ అయిన సందర్భంగా.. భారత్ - ఫ్రాన్స్ వ్యూహాత్మక భాగస్వామ్యం పాతికేళ్లు పూర్తి అయిన సందర్భంగా జులై 14న పారిస్ లో జరిగే బాస్టిల్ డే పరేడ్ కు మోడీని ఆహ్వానించారు. దీనికి ముఖ్య అతిధిగా హాజరు కావాలన్న ఆహ్వానాన్ని మన్నించిన ప్రధాని మోడీ.. తానీ కార్యక్రమానికి హాజరవుతానని పేర్కొన్నారు. ఈ విషయాన్ని భారత విదేశాంగ శాఖ వెల్లడించింది.