Begin typing your search above and press return to search.

తెలంగాణ ‘‘మోడీ’’ ఖాతాల్లో పైసలు నిల్

By:  Tupaki Desk   |   12 July 2016 9:19 AM GMT
తెలంగాణ ‘‘మోడీ’’ ఖాతాల్లో పైసలు నిల్
X
ప్రధాని మోడీ ఆర్భాటంగా షురూ చేసిన జన్ ధన్ యోజనకు సంబంధించి ఒక ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది. దేశంలోని ప్రతి పేదవారికి బ్యాంకు అకౌంట్ ఉండాలన్న లక్ష్యంతో స్టార్ట్ చేసిన ఈ పథకం గురించి ప్రధాని పలు సందర్భాల్లో గొప్పలు చెప్పుకోవటం కనిపిస్తుంది. తానిచ్చిన పిలుపుతో పేదలు పెద్ద ఎత్తున బ్యాంకుల్లో అకౌంట్లు ఓపెన్ చేశారని.. అలా పేదవారు ఓపెన్ చేసిన అకౌంట్లలో చిల్లర డబ్బులన్ని కలిపితే వేల కోట్లు అయినట్లుగా ఆయన చెప్పటం తెలిసిందే.

అలా ఓపెన్ చేసిన అకౌంట్లకు సంబంధించిన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఒక ఆసక్తికర అంశం తాజాగా బయటకు వచ్చింది. దీని ప్రకారం మొత్తం తెలంగాణ వ్యాప్తంగా 75 లక్షల జన్ ధన్ ఖాతాల్ని ప్రారంభించారు. వీటిల్లో పాతిక లక్షల ఖాతాల్లో పైసా డబ్బు లేని విషయం బయటకు వచ్చింది. పేదవారు ఓపెన్ చేసే ఈ ఖాతాదారులకు రూ.2వేల నుంచి రూ5వేల వరకూ అప్పు ఇవ్వాల్సి ఉంది. కానీ.. బ్యాంకులు వీరికి రుణ సదుపాయం కల్పించేందుకు పెద్దగా ఆసక్తి ప్రదర్శించటం లేదని చెబుతున్నారు.

దీనికి తగ్గట్లే బ్యాంకుఖాతాలు ఓపెన్ చేసిన వారు తమ ఖాతాల్లో పైసా కూడా దాచుకోవటం లేదని తేలింది. ఖాతాలో డబ్బులేమీ ఉండకపోవటం వల్ల.. వీరికి అందాల్సిన బీమా సౌకర్యం కూడా మిస్ అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. తెలంగాణ వ్యాప్తంగా 76 లక్షల ఖాతాలు ఉండగా..60 శాతం ఖాతాల్లో రూ.708 కోట్ల మొత్తం ఉండగా.. మిగిలిన ఖాతాల్లో పైసా కూడా లేకపోవటం గమనార్హం.