Begin typing your search above and press return to search.
ఉర్జిత్ రాజీనామాకు మోడీ మైండ్ బ్లాంకయ్యే రిప్లై
By: Tupaki Desk | 10 Dec 2018 10:06 PM ISTఅనూహ్య రీతిలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ ఉర్జిత్ పటేల్ ఇవాళ తన పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాల వల్ల తక్షణమే తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఉర్జిత్ తెలిపారు. ఆర్బీఐకి సేవ చేయడం గౌరవంగా భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. బ్యాంక్ విజయాల్లో ఆర్బీఐ సిబ్బంది - మేనేజ్ మెంట్ మద్దతు ఉన్నట్లు ఆయన చెప్పారు. ఆర్ బీఐ సెంట్రల్ బోర్డు డైరక్టర్లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ రాజీనామా నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆసక్తికర రీతిలో స్పందించారు. ఆందోళనకరంగా ఉన్న బ్యాంకింగ్ వ్యవస్థను ఉర్జిత్ ఓ దిశకు తీసుకువచ్చారని మోడీ ప్రశంసించారు. ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ సైతం దే రీతిలో స్పందించడం గమనార్హం.
ప్రభుత్వంతో ఏర్పడిన విభేదాల నేపథ్యంలో ఆర్ బీఐ గవర్నర్ పదవికి ఉర్జిత్ పటేల్ రాజీనామా చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ప్రజా ప్రయోజనాల విషయంలో ఆర్బీఐ గవర్నర్ కు ఆదేశాలు జారీ చేసేందుకు ఆర్ బీఐ చట్టంలో ఉన్న అధికారాలను ప్రభుత్వం ఉపయోగించింది. ఈ అధికారాలను గతంలో ఏ ప్రభుత్వం కూడా ఉపయోగించలేదు. ఆర్ బీఐ చట్టం సెక్షన్ 7 కిందట తన అధికారాలను ఉపయోగిస్తూ వివిధ కీలక అంశాలపై ఆర్ బీఐ గవర్నర్ కు ప్రభుత్వం కొన్ని లేఖలు రాసింది. ఈ సెక్షన్ 7 కింద స్వతంత్ర భారతంలో ఇప్పటివరకు గతంలోని ఏ ప్రభుత్వం కూడా తన అధికారాలను ఉపయోగించకపోవడం గమనార్హం.
ఇలా సంచలన పరిణామాల నేపథ్యంలో ప్రధాని ఊహించని ట్వీట్ చేశారు. ఉన్నత సామర్థ్యం ఉన్న ఆర్థికవేత్త ఉర్జిత్ పటేల్ అని, స్థూల ఆర్థిక అంశాలపై చాలా లోతనైన అవగాహన ఉందని ప్రధాని తన ట్వీట్ లో తెలిపారు. బ్యాంకింగ్ వ్యవస్థలో క్రమశిక్షణ తీసుకువచ్చారన్నారు. ఉర్జిత్ నేతృత్వంలో బ్యాంకులకు ఆర్థిక స్థిరత్వం కూడా వచ్చిందన్నారు. ఆర్బీఐలో డిప్యూటీ గవర్నర్ - గవర్నర్ గా మొత్తం ఆరేళ్ల పాటు ఉర్జిత్ పనిచేశారు. ఉర్జిత్ సేవలను ప్రభుత్వం గుర్తిస్తుందని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ట్వీట్ చేశారు. పబ్లిక్ సర్వీసులో మరి కొన్ని సంవత్సరాలు ఆయన ఉండాలని జైట్లీ తెలిపారు.