Begin typing your search above and press return to search.

మోదీ త‌ర్వాత కిమ్ ఆ త‌ర్వాత జిన్‌పింగ్‌

By:  Tupaki Desk   |   20 May 2020 1:30 AM GMT
మోదీ త‌ర్వాత కిమ్ ఆ త‌ర్వాత జిన్‌పింగ్‌
X
మందీమార్బలం లేనిదే పాలించే ప్ర‌భువు బ‌య‌ట‌కు రాలేడు. అది వారి భ‌ద్ర‌త‌తో పాటు వారిని అభిమానించే వారు ఎగ‌బ‌డ‌తార‌నే ఉద్దేశంతో ఆ విధంగా వారి చుట్టూ భ‌ద్ర‌తా సిబ్బంది ఎల్ల‌ప్పుడూ ఉంటుంది. అధికారంలో ప్రభుత్వ అధినేతలకు రాజ్యాంగమే వారికి ర‌క్ష‌ణ క‌ల్పిస్తుంది. అయితే అది ఎంత మేర అనేది వారి ప‌రిస్థితి ఆధారంగా ఉంటుంది. ఇప్పుడు ప్ర‌పంచంలోనే అత్యంత వ్య‌క్తిగ‌త భ‌ద‌త్రా సిబ్బంది ఎవ‌రికీ ఉంటుందంటే అమెరికా అధ్య‌క్షుడికే అని చెబుతారు. మ‌నం చూశాం భార‌త‌దేశంలో ఇటీవ‌ల డొన‌ల్డ్ ట్రంప్ ప‌ర్య‌టించిన దృశ్యాలు. వారికి ఎంత భ‌ద్ర‌త ఉందో తెలుసుకున్నాం. ట్రంప్ సెక్యూరిటీ కోసం రోజుకు 1 మిలియన్ డాలర్ల ఖర్చు చేస్తుండ‌డం గ‌మ‌నార్హం. అత‌డి త‌ర్వాత అంతగా భ‌ద్ర‌త ఉన్న‌ది బ్రిట‌న్ మ‌హారాణికి.

త‌ర్వాత మ‌న ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీకే అత్యంత భ‌ద్ర‌త ఉన్న‌ది. ప్ర‌పంచంలోనే అత్యంత భ‌ద్ర‌త ఉన్న మూడో నేత మ‌న ప్ర‌ధానినే. ప్రధానమంత్రి న‌రేంద‌మోదీకి సెక్యూరిటీ భారీ స్థాయిలో ఉంటుంది. ఏడంచెల సెక్యూరిటీ సాధార‌ణంగా ఉంటుంది. బ‌హిరంగ స‌భ‌లు, బ‌య‌ట కార్య‌క్ర‌మాల‌కు హాజ‌రైన‌ప్పుడు మఫ్టీలో సెక్యూరిటీ సిబ్బంది జనాల మధ్యలో ఉంటారు. మోడీ రక్షణ కోసం 5,200 మంది సిబ్బంది ఎప్పుడు సిద్ధంగా ఉంటారు.

ఇక న‌రేంద్ర మోదీ త‌ర్వాత నాలుగో స్థానంలో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ నిలిచారు. కిమ్‌కు 2 వేల మంది పర్సనల్ బాడీ గార్డ్స్ నిత్యం కాపలా కాస్తుంటారు. అయన ఎక్కడికి వెళ్తున్నా కనీసం చుట్టూ 200 మంది బాడీ గార్డ్స్ ఉంటారు. కిమ్ తరువాత స్థానంలో చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ఉన్నాడు. ఈ విధంగా భారీ భ‌ద్ర‌త క‌లిగిన టాప్ 5 నాయ‌కులు వీరే.