Begin typing your search above and press return to search.
మౌన్ సింగ్ కు.. మోడీకి తేడా లేదా?
By: Tupaki Desk | 13 Sep 2016 5:30 PM GMTఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజమనే చెప్పాలి. తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాల్ని చూస్తే ఇలా అనిపించటం తప్పేం కాదు. రెండున్నరేళ్ల కిందట మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు ఆయన వైఖరిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమయ్యేది. దేశంలో జరగరానిది ఏదైనా జరిగితే.. చటుక్కున స్పందించే తత్వం ప్రధానిలో లేదన్న భావన వ్యక్తమయ్యేది. దీనికి తగ్గట్లే దేశంలో ఏం జరిగినా.. మన్మోహన్ సింగ్ మౌన మునిలా ఉండేవారేకానీ.. స్పందించే వారు కాదు.
అందుకు భిన్నంగా మోడీ ఉంటారని భావించారు. దీనికి తగ్గట్లే మొదట్లో.. ఏదైనా రాష్ట్రంలో ఏదైనా జరిగితే వెనువెంటనే రియాక్ట్ అవుతున్నట్లు.. వాకబు చేసినట్లుగా వార్తలు వచ్చేవి. కొద్దికాలంగా అలాంటివేమీ కనిపించటం లేదని చెప్పాలి. తాజాగా కావేరీ జల వివాదంలో కర్ణాటక.. తమిళనాడు రాష్ట్రాల మధ్య తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం కావటం.. కర్ణాటక తగలబడిపోవటం చూస్తున్నదే.
ఇంత జరుగుతున్నా.. ప్రధాని మోడీ స్పందించటం కనిపించదు. బయటకు వచ్చి స్టేట్ మెంట్లు ఇవ్వాల్సిన అవసరం లేకున్నా.. ప్రభుత్వ యంత్రాంగాన్ని కదల్చటం.. రెండు రాష్ట్రాల మధ్య సమస్య పరిష్కార దిశగా ప్రయత్నాలు పావులు కదపటం లాంటి విషయంలో ఆయన సైలెంట్ గా ఉన్నట్లుగా పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. కావేరీ రచ్చ మీద ప్రధాని ఆరా తీయటం.. అధికారులతో భేటీ కావటం.. అక్కడి పరిస్థితులపై ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడటం లాంటివి చేసి ఉంటే బాగుండేదన్న భావన వ్యక్తమవుతోంది.
అక్కడెక్కడో ఉన్న అమెరికా.. కావేరీ ఇష్యూ మీద రియాక్ట్ కావటమే కాదు.. తమ పౌరుల్ని బెంగళూరుకు వెళ్లొద్దంటూ ఆదేశాలు జారీ చేసింది. అల్లంత దూరాన ఉన్న అమెరికా రియాక్ట్ అయినప్పుడు ఈ దేశ ప్రధాని స్పందించకపోవటం ఏమిటి? కావేరీ ఇష్యూ మీద మోడీ ఫోకస్ చేశారన్న చిన్న ప్రకటన కూడా బయటకు రాకపోవటం ఏమిటి? భావోద్వేగ అంశాలు చోటు చేసుకున్నప్పుడు చటుక్కున రియాక్ట్ కావాల్సిన స్థానే మౌనంగా ఉన్నట్లుగా కనిపించటం తప్పన్న భావన వ్యక్తమవుతోంది.
ఇలాంటి విమర్శలు పెద్ద ఎత్తున వస్తున్న వేళ.. ఎట్టకేలకు ప్రదాని మోడీ స్పందించారు. ఇరు రాష్ట్రాల ప్రజలు సంయమనం పాటించాలని.. సామాజిక బాధ్యతల్ని గర్తు పెట్టుకోవాలని కోరారు. రెండు రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితులు తనను ఎంతగానో బాధించినట్లుగా మోడీ వెల్లడించారు. ప్రజాస్వామ్యంలో సమస్యలకు పరిష్కారం చర్చల ద్వారానే సాధ్యమవుతాయని వ్యాఖ్యానించారు. ఈ నాలుగు ముక్కలు చెప్పటానికి మోడీ ఇంత టైం తీసుకోవటం ఏమిటి? మోడీకి.. మన్మోహన్ కు పోలిక పెడుతున్న వేళ.. అది తప్పన్నట్లు మోడీ రియాక్ట్ అయినా.. జరిగిన ఆలస్యం మాత్రం దేశ ప్రజల మనసుల్లో రిజిష్టర్ అయ్యిందన్న విషయాన్ని మాత్రం మర్చిపోలేం.