Begin typing your search above and press return to search.

సోషల్ మీడియా కింగ్ మోడీనే..సెకండ్ ప్లేస్ ఎవరిదంటే?

By:  Tupaki Desk   |   24 Nov 2020 3:45 AM GMT
సోషల్ మీడియా కింగ్ మోడీనే..సెకండ్ ప్లేస్ ఎవరిదంటే?
X
ఇవాల్టి రోజున దేశ ప్రజల్ని ప్రభావితం చేయటంలో సోషల్ మీడియా కీలకభూమిక పోషిస్తోంది. ఈ విషయాన్ని అందరూ అర్థం చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా సోషల్ మీడియాలో టాప్ ట్రెండ్స్ ఏమిటి? సోషల్ మీడియాలో అగ్రస్థానంలో ఉన్న రాజకీయ నేతలు ఎవరు? 500 మంది అత్యున్నత ప్రతిభాశీలురు ఎవరన్న అంశంపై చెక్ బ్రాండ్స్ సంస్థ ఒక నివేదికను వెల్లడించింది. ఇందులో పలు ఆసక్తికర అంశాలున్నాయి.

ఈ సంస్థ తాజా రిపోర్టు ప్రకారం దేశంలో సోషల్ మీడియా కింగ్ మోడీగా తేల్చారు. ఆసక్తికరంగా రెండో స్థానంలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఉన్నట్లుగా పేర్కొంది. ట్విటర్.. గూగుల్ సెర్చ్.. యూ ట్యూబ్ ప్లాట్ ఫామ్స్ లో అత్యధిక ట్రెండ్ ఎవరిపైన ఉన్నాయన్న అంశాన్ని ప్రత్యేకంగా పరిశీలించారు. ఆగస్టు నుంచి అక్టోబరు మధ్య కాలంలో సోషల్ మీడియా టాప్ ట్రెండ్స్ నుచెక్ చేసిన ఈ విషయాన్ని వెల్లడించారు.

ఈ రిపోర్టును తయారుచేసే క్రమంలో దేశంలోని టాప్95 మంది పొలిటికల్ లీడర్లు.. 500 మంది అత్యున్నత ప్రభావశీలురుకు సంబంధించిన ట్రెండ్స్ ను ఈ సంస్థ విశ్లేషించింది. దీని ప్రకారం 2171 ట్రెండ్స్ తో ప్రధాని మోడీ మొదటి స్థానంలో నిలిస్తే.. ఆయనకు అత్యంత సమీపంలోకి వచ్చారు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రావటం గమనార్హం. ఆయనకు 2137 ట్రెండ్స్ వచ్చినట్లుగా సదరు రిపోర్టు పేర్కొంది. మూడో స్థానంలో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా.. కాంగ్రెస్ సీనియర్ నేతలు రాహుల్.. సోనియాలు ఉన్నారు.

బ్రాండ్ స్కోర్ విషయంలోనూ మోడీ ముందు ఉండటం విశేషం. దీన్ని ఎలా లెక్కిస్తారంటే.. సోషల్ మీడియా వేదికలో ఫాలోవర్స్.. ట్రెండ్స్.. సెంటిమెంట్స్.. ఎంగేజ్ మెంట్.. మెన్షన్స్.. ఆధారంగా ఈ స్కోర్ ను నిర్ణయిస్తారు. ఇందులో మోడీ మొదటి స్థానంలో నిలిస్తే.. కేంద్ర హోం మంత్రి అమిత్ షా రెండో స్థానంలో నిలవటం గమనార్హం. ఈ విభాగంలో మూడో స్థానంలో అసోం మాజీ సీఎం తరుణ్ గొగోయ్ (వీరు సోమవారం మరణించారు).. అరుణాచల్ ప్రదేశ్ సీఎం పెమా ఖండూ.. యూపీ ముఖ్యమంత్రి యోగి లు ఉన్నారు.

ఇక.. బ్రాండ్ వాల్యూ విషయానికి వస్తే.. ఇందులోనూ ప్రధాని మోడీ అగ్ర స్థానంలో ఉన్నారు. ఆయన బ్రాండ్ వాల్యూ రూ.336 కోట్లుగా.. తర్వాతి స్థానంలో ఉన్న అమిత్ షా ది (రూ.335 కోట్లు).. డిల్లీ సీఎం కేజ్రీవాల్ (రూ.328 కోట్లు) ఉన్నారు. ప్రధాని మోడీపై 25 శాతం వ్యతిరేక సెంటిమెంట్ ఉన్నప్పటికీ.. ఎంపిక చేసిన 95 మంది నేతల్లో ఆయన బ్రాండ్ వాల్యూనే అత్యధికంగా ఉన్నట్లుగా చెక్ బ్రాండ్ చెబుతోంది. సోషల్ మీడియాతో ప్రభావితం చేస్తారన్న పేరు ప్రధాని మోడీకి ఉన్నా.. అదే స్థాయిలో ఉందన్న విషయాన్ని తాజా రిపోర్టు స్పష్టం చేసిందని చెప్పాలి.