Begin typing your search above and press return to search.
తెలుగు రాష్ట్రాలకు మూడో వందే భారత్.. ఈసారి రూట్ ఏదంటే?
By: Tupaki Desk | 11 April 2023 9:56 AM GMTతెలుగు రాష్ట్రాలకు మరో తీపి కబురు పంపేందుకు రంగం సిద్ధమవుతోంది. ఒక్క రైలుతో మూడు రాష్ట్రాల వారికి మేలు కలిగే నిర్ణయాన్ని మోడీ సర్కారు తీసుకోవటంతో పాటు.. త్వరలోనే అధికారికంగా ప్రకటిస్తారన్న మాట వినిపిస్తోంది. సంక్రాంతి పండక్కి.. విశాఖ - సికింద్రాబాద్ మధ్య వందేభారత్ రైలును గిప్టుగా ఇచ్చిన ప్రధాని మోడీ.. రీసెంట్ గా సికింద్రాబాద్ - తిరుపతి మధ్య మరో వందే భారత్ కు తానే స్వయంగా జెండా ఊపి మరీ ప్రారంభించిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల జోరు సాగుతున్న వేళ.. మరికొద్ది నెలల్లో తెలంగాణలో షురూ కానున్న ఎన్నికల వేళకు పర్ ఫెక్టు గిఫ్టుగా మరో వందే భారత్ రైలును రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకకు లింకు అయ్యే ప్లాన్ త్వరలోనే అమల్లోకి రానున్నట్లు చెబుతున్నారు.
దేశీయంగా ఐటీ కేంద్రాలన్నంతనే గుర్తుకు వచ్చే బెంగళూరు - హైదరాబాద్ నగరాల్ని వందే భారత్ తో కలిపేందుకు వీలుగా కొత్త సర్వీసును అందుబాటులోకి తేనున్నారు. త్వరలో పట్టాలెక్కే అవకాశం ఉన్న వందే భారత్ రైలు హైదరాబాద్ లోని కాచిగూడ రైల్వే స్టేషన్ నుంచి బెంగళూరు వరకు అందుబాటులోకి తేనున్నట్లు చెబుతున్నారు.
ప్రస్తుతం కాచిగూడ స్టేషన్ మీదుగా బెంగళూరుకు రోజుకు ఏడు ఎక్స్ ప్రెస్ రైళ్లు నడుస్తున్నాయి. వీకెండ్ లో ఒకట్రెండు స్పెషల్ రైళ్లను నడుపుతున్నారు.
సికింద్రాబాద్ నుంచి బెంగళూరుకు 570 దూరం ఉండగా.. ఈ దూరాన్ని చేరుకోవటానికి పదకొండు గంటల సమయం పడుతోంది. దీన్ని వందే భారత్ రైల్లో ఏడు గంటల్లో పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నారు.
విశ్వసనీయ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం కాచిగూడ తర్వాత శ్రీ సత్యసాయి ప్రశాంత్ నగర్.. గుంతకల్లు.. రాయచూర్.. సేడమ్ స్టేషన్లలో హాల్టులు ఉండేలా ప్లాన్ చేస్తున్నట్లుగా చెబుతున్నారు. ఈ వందే భారత్ అందుబాటులోకి వస్తే.. తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఎంతో మేలు చేస్తుందని చెప్పక తప్పదు.