Begin typing your search above and press return to search.
మోడీకి లైవ్ మీడియా అంటే భయమా? అందుకే ప్రెస్ మీట్ పెట్టడా?
By: Tupaki Desk | 28 Aug 2020 4:30 PM GMTఅవి గుజరాత్ సీఎంగా నరేంద్ర మోడీ ఉన్న రోజులు.. మూడు సార్లు వరుసగా ముఖ్యమంత్రిగా ఉన్నారు.. మోడీ హయాంలో గుజరాత్ లో గోద్రా అల్లర్లు సహా మైనార్టీలపై ఎన్నో దాడులు జరిగాయి. హత్యలు చోటుచేసుకున్నాయి. దీని వెనుక మోడీ ఉన్నారన్న విమర్శలున్నాయి. ఒకవర్గం వారినే మోడీ కాపుకాశారన్న విమర్శ ఉంది. అయితే మొదటి సారి మోడీ 2007లో ఓ స్వతంత్ర మీడియా సీఎన్ఎన్ ఐబీఎన్ అనే అంతర్జాతీయ సంస్థకు ఇంటర్వ్యూ ఇవ్వడానికి వచ్చాడు. ఇంటర్వ్యూ చేసేది పేరు మోసిన కరణ్ థాపర్ అనే బీకర జర్నలిస్టు.. ఆయన ప్రశ్నలకు మోడీ ఇంటర్వ్యూ మధ్యలోనే వదిలేసి వెళ్లిపోయాడు. మోడీ చేత నీళ్లు తాగించాడు.అప్పట్లో అది తీవ్ర చర్చనీయాంశమైంది. అప్పటి నుంచి ఇప్పటివరకు ఏ స్వతంత్ర జర్నలిస్టును మోడీ దగ్గరకు రానీయడం లేదు. లైవ్ ఇంటర్వ్యూ ఇవ్వలేదు.
ప్రపంచంలోనే బెస్ట్ వక్తగా అనిపించుకునే భారత ప్రధాని నరేంద్రమోడీకి లైవ్ మీడియాలో ఎప్పుడూ మాట్లాడరనే అపవాదు ఉంది. ముఖ్యంగా ఇంగ్లీష్ మీడియాతో అస్సలు మాట్లాడరాయన.. అంత మంచి కమ్యూనికేటర్ అయిన మోడీ ఎందుకు మాట్లాడరు అంటే.. లైవ్ లో మాట్లాడితే జర్నలిస్టులు కఠినంగా ప్రశ్నలు అడిగితే.. సమాధానం చెప్పకపోతే ఇమేజ్ పోతదనే భయం మోడీలో ఉంటుందట..
అందుకే తనకు అనుకూలమైన.. బీజేపీ వాదులైన సెలెక్టివ్ జర్నలిస్టులతోనే మోడీ ఇంటర్వ్యూలు చేపించుకొని దాన్ని మీడియాలో.. సోషల్ మీడియాలో ప్రమోట్ చేసుకుంటాడనే ప్రచారం ఢిల్లీ వర్గాల్లో ఉంది. ఇంతవరకు ఎప్పుడు కూడా మోడీ లైవ్ లో ప్రెస్ మీట్ పెట్టిన సందర్భాలు లేనేలేవు. మోడీ ఎప్పుడు కూడా ఒక్కడే టీవీలో కనపడి లైవ్ ఇచ్చి వెళ్తాడు. ఇచ్చే ముందు కూడా పెద్ద ఎత్తున చర్చ ఉండేటట్టు చేస్తూ ఉంటాడు.
మోడీ పీఎం అయ్యాక.. పూర్తి స్థాయిలో లైవ్ మీడియాలో జర్నలిస్టులతో ప్రెస్ మీట్ పెట్టింది లేదు. కానీ వ్యక్తిగతంగా జర్నలిస్టులతో సంబంధాలు పెట్టుకొని వాళ్లను ప్రసన్నం చేసుకుంటాడు. మోడీ మీడియాను పక్కనపెట్టడానికి కారణం ఉంది. అది గుజరాత్ సీఎంగా ఉన్న సమయంలో కరణ్ థాపర్ ఇంటర్వ్యూనే అన్న ప్రచారం జర్నలిస్టుల్లో ఉంది. మొత్తానికి లైవ్ మీడియా అంటే మోడీకి.. ‘ఫోబియా’ అని జర్నలిస్ట్ సర్కిల్స్ లో టాక్ ఉంది.