Begin typing your search above and press return to search.

వేడుకలకు రమ్మని మోడీ పిలిస్తే.. ఇప్పటివరకు ఆ దేశ ప్రధాని సమాధానం చెప్పలేదట

By:  Tupaki Desk   |   3 Dec 2020 6:30 AM GMT
వేడుకలకు రమ్మని మోడీ పిలిస్తే.. ఇప్పటివరకు ఆ దేశ ప్రధాని సమాధానం చెప్పలేదట
X
జనవరి 26న నిర్వహించే గణతంత్ర దినోత్సవం (రిపబ్లిక్ డే) వేళ.. ప్రతి ఏటా ఒక విదేశీ విశిష్ఠ అతిధిని ఆహ్వానించటం చూస్తున్నదే. వచ్చే ఏడాది రిపబ్లిక్ డే వేడుకుల కోసం బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ను ప్రధాని మోడీ ఆహ్వానించారు. గత నెలలోనే ఆయన తన ఆహ్వానాన్ని పంపారు. నవంబరు 27న బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ కు ఫోన్ చేసిన ప్రధాని మోడీ.. ఆయన్ను జనవరి 26న జరిగే గణతంత్ర వేడుకలకు రావాలని కోరారు.

ఈ సందర్భంగా వచ్చే ఏడాది తమ దేశంలో నిర్వహించే జీ7 సమ్మిట్ కు హాజరు కావాలని ప్రధాని మోడీని బ్రిటన్ ప్రధాని ఆహ్వానించినట్లు తెలిసింది. అయితే.. మోడీ నుంచి ఆహ్వానం పొందినప్పటికి.. బ్రిటన్ ప్రధాని ఇంకా స్పందించలేదని తెలుస్తోంది. ఆయన తన అంగీకారాన్ని ఇంకా చెప్పలేదంటున్నారు. ఒకవేళ.. బ్రిటన్ ప్రధాని కానీ హాజరవుతుంటే.. అదో రికార్డుగా మారుతుందని చెబుతారు.

దాదాపు 27 ఏళ్ల తర్వాత రిపబ్లిక్ వేడుకలకు బ్రిటన్ ప్రధానమంత్రి వచ్చినట్లు అవుతుంది. గతంలో అంటే 1993లో అప్పటి యూకే ప్రధాని జాన్ మేయర్.. దేశ రాజధానిలో నిర్వహించిన గణతంత్ర వేడుకలకు హాజరయ్యారు. ఆ తర్వాత నుంచి ఇప్పటివరకు మరే బ్రిటన్ ప్రధాని హాజరుకాలేదు. తమ ప్రధాని పర్యటన గురించి తామెంతో ఆత్రుతతో ఎదురుచూస్తున్నట్లుగా బ్రిటన్ హైకమిషన్ అధికార ప్రతినిధి వెల్లడించారు. మోడీ మాష్టారు స్వయంగా పిలిచిన తర్వాత కూడా తన నిర్ణయాన్ని బోరిస్ జాన్సన్ ఇంకా వెల్లడించకపోవటం ఏమిటంటారు?