Begin typing your search above and press return to search.

సెర్జికల్ స్ట్రైక్ సమయంలో ఫోన్ పక్కనే ఉన్నా.. : మోదీ ఆసక్తికర కామెంట్స్

By:  Tupaki Desk   |   4 Nov 2021 10:02 AM GMT
సెర్జికల్ స్ట్రైక్ సమయంలో ఫోన్ పక్కనే ఉన్నా.. : మోదీ ఆసక్తికర కామెంట్స్
X
దీపావళి సంబరాలు గురువారం దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. అయితే అంతకంటే ముందే భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సైనికులతో కలిసి వేడుకలను నిర్వహించుకున్నారు. భారత బార్డర్లో ఉన్న సైనికులకు స్వీట్లు పంచారు. వారితోకాసేపు మాట్లాడారు. దేశ భద్రతకు సైనికులు చేసే త్యాగం మరువలేనిదని అన్నారు. ప్రతీ దీపావళి సందర్భంగా తాను సైనికులతో కలిసి ఉంటానని, వారితో కలిసి వేడుకలు నిర్వహించుకుంటానని మోదీ అన్నారు. అయితే ఈ సందర్భంగా మోదీ సర్జికల్ స్ట్రైక్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం మోదీ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

దీపావళి సందర్బంగా మోదీ సైనికులతో ఉత్సాహంగా గడిపారు. పగలు, రాత్రి తేడా లేకుండా నిరంతరం శ్రమించే వారు సైనికులు మాత్రమేనన్నారు. పండుగలు, కుటుంబ బాంధవ్యాలను మరిచి దేశ సేవకు నిరంతరం కృషి చేస్తారన్నారు. అయితే సర్జికల్ స్ట్రైక్ లాంటి సంఘటనలో భారత సైనికుల్లో కాస్త బలం పెరిగిందని, దీంతో శత్రువులతో పోరాటం చేయడంలో భారత్ ఏ విషయంలోనూ తక్కువ లేదని అన్నారు. శత్రువులను తరిమికొట్టడంలోసైనికులు వీరోచిత పోరాటం చేస్తారని అన్నారు. సర్జికల్ స్ట్రైక్ సమయంలో ఎప్పటి కప్పుడు సమాచారం తెలుసుకుంటున్నానని, తాను ఫోన్ పక్కనే కూర్చొని ఉన్నానని అన్నారు. సర్జికల్ స్ట్రైక్ తో శత్రువుల గుండెల్లో రైళ్లు పరుగెత్తాయని, దీంతో భారత్ సత్తా ఏంటో నిరూపించామన్నారు.

అప్పటి వరకు పూల్వామా దాడితో రగిలిపోతున్న భారతీయులు ఉగ్రవాదులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో భారతీయుల ఆగ్రహం తరుపున పాకిస్తాస్ దేశంలోని బాలకోట్ పై దాడులు చసింది. పాకిస్తాన్ సరిహద్దులో ఉన్న చిన్న పట్టణం బాల కోట్. జమ్మూ కాశ్మీర్ సరిహద్దులకు ఉండే ఈ బాలాకోట్ రాజకీయాలకు కేరాఫ్ గా నిలచింది. భారత వైమానిక దళం మిరజ్ 2000 ఎయిర్ క్రాప్టులను ఉపయోగించి ఇజ్రాయెల్ లో తయారైన స్పైస్ బాంబులను ప్రయోగించింది. ఉగ్రవాద నాయకుడు జైషే మహ్మద్ ను అంతమొందించింది. ఆ సంస్థకు చెందిన ఉగ్రవాద మూలలను తెరిపివేసింది. 128 చదరపు మీటర్ల పరిధిలో ఈ దృశ్యాలు శాటిలైట్ ద్వారా సేకరించారు.

అంతకుముందు జమ్ముకాశ్మీర్ లోని పూల్వాజా జిల్లా అవంతిపురా వద్ద 2019 ఫిబ్రవరి 14న జైషే ఉగ్రవాదులు మారణ హోమాన్ని సృస్టించారు. సెలవులను ముగించుకొని విధులకు హాజరు కావడానికి వెళ్తున్న సైనికులపై ఉగ్రవాదులు విరుచుకుపడ్డారు. ఆత్మాహుతి దళ సభ్యుడు చేసిన దాడిలో 40 మంది జవాన్లు అమరులయ్యారు. కొంత మంది గాయపడ్డారు. వీరిలో చాలా మంది ఇప్పటికీ కోలుకోలేని పరిస్థితి ఉంది. దీంతో భారతీయులు రగిలిపోవడంతో బాలాకోట్ పై దాడి అసరమైంది.

బాలాకోట్ పై దాడి తరువాత అనేక రాజకీయ విమర్శలకు ఇది కేంద్ర బిందువుగా మారింది. దీనిని కొందరు సమర్థించగా.. కొందరు వ్యతిరేకించారు. ఈ దాడులను అడ్డుపెట్టుకొని పాకిస్తాన్ అంతర్జాతీయ దాడులపై విమర్శలు చేసేందుకు యత్నించింది. కాకపోతే ఆ ప్రయత్నాలన్నీ వృథా అయ్యాయి. జైషే మహ్మద్ ఉగ్రవాద కార్యకాలపాలు పాకిస్తాన్ కేంద్రంగా సాగుతున్నట్లు భారత్ ఆధారాలతో నిరూపించింది.

అయితే పాకిస్తాన్ అయినా తన బుద్ధి మార్చుకోవడం లేదు. అప్ఘనిస్తాన్ లో తలదాచుకున్న ఉగ్రవాదులకు సాయం చేస్తూ భారత్ పై పంపేందుకు యత్నిస్తోంది. ఇటీవల జమ్మూలో వరుసగా జరుగుతున్న దాడులే ఇందుకు ఉదాహరణ. వలస వచ్చిన వారిని వరుసగా హత్య చేయడంతో అక్కడి వారు తమ సొంత స్థలాలకు వెళ్లారు. జమ్మూకాశ్మీర్ ను అభివృద్ధి చేద్దామనుకుంటున్న భారత్ ప్రయత్నానికి అడ్డంకులు సృష్టిస్తోంది. అయితే పాక్ ఇలాంటి కవ్వింపు చర్యలు కొనసాగిస్తే మరోసారి సర్జికల్ స్ట్రైక్ తప్పదని హెచ్చరించింది.