Begin typing your search above and press return to search.

మోడీ మనసు దోచుకున్న కేసీఆర్ సర్కారు

By:  Tupaki Desk   |   23 March 2016 5:14 PM GMT
మోడీ మనసు దోచుకున్న కేసీఆర్ సర్కారు
X
మోడీ నోట ప్రశంస మాట ఒకటి వచ్చింది. అయితే.. అది మిత్రులకు కాకుండా.. అవసరానికి తగ్గట్లుగా అడిగి మరీ తమ పనులు చేయించుకునే తెలంగాణ సర్కారుపై ఆయన తాజాగా ప్రశంసించారు. మోడీ లాంటి నేత దేశంలో బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉన్నా.. ఎన్డీయేలో భాగస్వామ్య పార్టీ సర్కారులు ఉన్నా.. అవేమీ చేయలేని పనిని.. కేసీఆర్ సర్కారు చేస్తున్నట్లుగా ఆయన మాటలు ఉన్నాయి.

తాజాగా అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన నరేంద్ర మోడీ.. ఆయా ప్రాజెక్టులకు పర్యావరణ అనుమతులు సాధించే విషయంలో తెలంగాణ ప్రభుత్వం చొరవ చూపిస్తుందంటూ పొగిడేశారు. ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదిస్తున్న తెలంగాణ ప్రాంత అధికారులు తమ పనులు చేయించుకునే విషయంపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు.

వాస్తవానికి కేంద్రం నుంచి అవసరానికి తగ్గట్లు పనులు చేయించుకునే విషయంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. అందుకు భిన్నంగా.. బాబు కంటే మిన్నగా కేసీఆర్ కాలు కదపకుండా రాష్ట్రానికి అవసరమైన పనుల్ని చేసుకున్నారంటే మామూలు విషయం కాదనే చెప్పాలి.మొత్తానికి తన పాలనా దక్షతతో కేసీఆర్ ప్రధాని మోడీ మనసును దోచుకున్నట్లు కనిపిస్తోంది.