Begin typing your search above and press return to search.
పడిపోయిన మోడీ ఇమేజ్.. ప్రకటించిన రేటింగ్ సంస్థ!
By: Tupaki Desk | 19 May 2021 3:30 PM GMTప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గ్రాఫ్ తగ్గుతోందా? జనాలకు ఆయనపై నమ్మకం సన్నగిల్లుతోందా? అంటే.. ఔను అనే సమాధానమే వినిపిస్తోంది. కరోనా సెకండ్ వేవ్ విషయంలో మోడీ సర్కారు తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శించిందని, ప్రజల ప్రాణాలకన్నా ఎన్నికలకే ప్రాధాన్యమిచ్చారని విమర్శలు ఎదురైన విషయం తెలిసిందే.
ఈ విషయంలో దేశంలోని ప్రముఖులతోపాటు అంతర్జాతీయ మీడియా సైతం తీవ్రంగా తప్పుబట్టింది. దేశంలో సాధారణ జనం కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే.. మోడీ గ్రాఫ్, అంతర్జాతీయంగా ఆయనకు ఉన్న ఇమేజ్ తగ్గిపోతోందని అమెరికాకు చెందిన సంస్థ వెల్లడించింది.
ప్రపంచస్థాయి లీడర్ల పాపులారిటినీ ట్రాక్ చేసే 'మార్నింగ్ కన్సల్ట్' సంస్థ ఈ విషయాన్ని వెల్లడించింది. 2019 తర్వాత మోడీ రేటింగ్ అత్యల్పంగా 63 శాతానికి పడిపోయిందని ప్రకటించింది. ఈ పరిస్థితి మరింత కిందకు పడిపోయే అవకాశం ఉందని అంచనా వేసింది.