Begin typing your search above and press return to search.

మోడీ ఇడ్లీలు రూ. 10కే నాలుగు .. సరికొత్త ప్రచారం!

By:  Tupaki Desk   |   1 Sep 2020 12:10 PM GMT
మోడీ ఇడ్లీలు రూ. 10కే నాలుగు .. సరికొత్త ప్రచారం!
X
ప్రధాని నరేంద్ర మోదీ పేరుతో తమిళనాడులో వింత పోస్టర్లు దర్శనం ఇస్తున్నాయి . రూ. 10 నాలుగు ఇడ్లీలు అంటూ సేలం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో టిఫిన్ సెంటర్లు ఏర్పాటు చేశారు. ఆ ప్లెక్సీలపై ప్రధాని మోదీ ఫోటో తో ఆ రాష్ట్ర బీజేపీ ప్రచార కమిటీ ఉపాధ్యక్షుడు మహేష్ ఫొటోలను ముద్రించారు. దీనితో జనం ఆసక్తి కనబరుస్తున్నారు. ఇవి సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతున్నాయి. అయితే ప్రజల కు తక్కువ ధరకే ఇడ్లీలను అందించి ఆయన పలుకుబడి మరింత విస్తరించేలా చేయడానికేనని చెబుతున్నారు. మోదీ ఇడ్లీస్ పేరుతో మహేష్ ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 22 చిన్నపాటి హోటళ్లలో వీటిని అందించనున్నారు. వీటి ద్వారా వచ్చే ఆధరణ బట్టి మరిన్ని విస్తరిస్తామని ఆయన చెబుతున్నారు.

దేశవ్యాప్తంగా వీస్తున్న ప్రధాని మోడీ ప్రభంజనం తమిళనాడు లోనూ విస్తరించాలన్నదే తమ లక్ష్యమని చెబుతున్నారు. వచ్చే ఎన్నికల నాటికి బీజేపీ మరింత బలపడేలా ఈ వినూత్న ప్రచార కార్యక్రమం చేపట్టామని అంటున్నారు. ప్రస్తుతం 22 చిన్నపాటి హోటళ్లలో వీటిని వినియోగదారులకు అందించే ఏర్పాటు చేస్తున్నామని, రాబోయే రోజుల్లో వీటిని మరింత పెంచుతామని ఆయన చెప్పారు. ఈ సరికొత్త ప్రచారం తన పలుకుబడి పెరగడానికి కూడా దోహదపడుతుందని ఆయన ఆశిస్తున్నాడు. దీనికి కావాల్సిన ఏర్పాట్లు కూడా పూర్తి కావడంతో వచ్చే వారం హోటళ్లను ప్రారంభిస్తారు. ఈ వినూత్న ప్రచారం పలువురిని ఆకట్టుకుంటోంది. కాగా తమిళనాడులో ఇలాంటివి కొత్తేమి కాదు. అక్కడ ఇది వరకే ‘అమ్మా క్యాంటీన్’ పేరుతో ప్రజలకు తక్కువ ధరకే ఆహారం అందిస్తున్న సంగతి తెలిసిందే.