Begin typing your search above and press return to search.
6 ఏళ్లలో 300శాతం పెంచిన మోడీ సార్
By: Tupaki Desk | 23 March 2021 11:30 PM GMTగత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఓ మోస్తారు పెరిగితేనే రోడ్లపైకి వచ్చి ప్రజలు, ప్రతిపక్షాలు ఆందోళన చేసే వారు. కానీ ఇప్పుడు మోడీ సార్ రేట్లను ప్రతిరోజు తూకాలెక్కన పెంచేసరికి ఆందోళన కారులు కూడా ఇక చాలించుకున్నారు. పెట్రోల్, గ్యాస్ ధరలను రోజువారీగా పెంచేస్తూ కేంద్రంలోని మోడీ సర్కార్ సామాన్యుల నడ్డి విరుస్తోంది.
మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి పెట్రోల్ మరియు డీజిల్ పై పన్నులు అనేక రెట్లు పెరుగుతున్నాయి. కేంద్ర పన్నులలో రాష్ట్రాల వాటాను కోల్పోయే విధంగా పన్నులను సర్‌చార్జీలుగా కేంద్రం పెంచుతూ పోతోంది.
పార్లమెంటులో తాజాగా ఇచ్చిన సమాధానం ప్రకారం.. గత ఆరేళ్లలో కేంద్ర ప్రభుత్వానికి ఇంధనంపై పన్నుల ద్వారా వచ్చే ఆదాయం 300% పెరగడం విశేషం. మోడీ పాలన మొదటి సంవత్సరంలో అంటే 2014-15లో పెట్రోల్‌పై ఎక్సైజ్ పన్ను 29,279 కోట్లు, డీజిల్‌పై ఎక్సైజ్ పన్ను 42,881 కోట్లు.
ఈ ఆర్థిక సంవత్సరం (2020-21) మొదటి పది నెలల్లో పెట్రోల్, డీజిల్‌పై పన్నులు కేంద్ర ప్రభుత్వానికి 2.94 లక్షల కోట్ల ఆదాయాన్ని తెచ్చాయి. 2014 లో పెట్రోల్‌పై ఎక్సైజ్ పన్ను లీటరుకు 9.48 రూపాయలు, ఇది ఇప్పుడు లీటరుకు 32.90 రూపాయలకు పెరిగింది. 2014 లో డీజిల్‌పై ఎక్సైజ్ పన్ను లీటరుకు 3.56 రూపాయలు, ఇది ఇప్పుడు లీటరుకు 31.80 రూపాయలకు పెరిగింది. అంటే మోడీ సార్ పిండేయడం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు..