Begin typing your search above and press return to search.
కార్మికులకు మోదీ సర్కార్ గుడ్న్యూస్... ఇక వారంలో మూడురోజులు సెలవులు..!
By: Tupaki Desk | 10 Feb 2021 7:30 AM GMTకార్మికుల కోసం మోదీ సర్కారు సంచలన నిర్ణయం తీసుకోబోతున్నది. ఇక నుంచి వారంలో మూడు రోజులు సెలవులు పెట్టబోతున్నారట. కేవలం 4 రోజులు మాత్రమే పనిదినాలు ఉండబోతున్నాయట. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం చట్టాల్లో మార్పులు తేనున్నట్టు సమాచారం. కార్మిక చట్టాల్లో కొన్ని మార్పులు చేశామని ఇక నుంచి వారంలో కేవలం 4 మాత్రమే వర్కింగ్ డేస్ చేయబోతున్నామని కేంద్ర కార్మికశాఖ కార్యదర్శ అపూర్వ చంద్ర.. సోమవారం పేర్కొన్నారు.
అయితే నాలుగురోజుల్లో పనిగంటల్లో కొంత మార్పులు చేయబోతున్నట్టు సమాచారం. రోజులో ప్రస్తుతం ఎనిమిది గంటలు మాత్రమే ఉద్యోగులు పనిచేస్తున్నారు. అయితే దాన్ని 10 గంటలకు పెంచే అవకాశం ఉందని సమాచారం. ఆయా కంపెనీలు తమ ఉత్పాదకత ఆధారంగా ఈ నిర్ణయం తీసుకొనేందుకు అవకాశం కల్పించారు. ప్రస్తుతం దేశంలోని చాలా కంపెనీలు ఆరురోజులు ఉద్యోగులతో పనిచేయించుకుంటున్నాయి. మరికొన్ని కంపెనీలు మాత్రం వారంలో ఐదురోజులు మాత్రమే పనిచేయించుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది.
అయితే వారంలో 4రోజుల పనివిధానం.. పక్కాగా అమలు చేయాలని అన్ని కంపెనీలకు ఆదేశాలు జారీచేస్తారా? లేదా? ఆయా కంపెనీల ఇష్టప్రకారమే ఈ నిర్ణయం తీసుకోవచ్చా అన్న విషయంపై ఇంకా క్లారిటీ లేదు. కొత్త కార్మిక చట్టాలు, నాలుగు రోజుల పనిదినాల కోసం చర్చలు జరుపుతున్నామని కేంద్రం పేర్కొన్నది. కోడ్, పారిశ్రామిక సంబంధాలు, వృత్తి భద్రత, ఆరోగ్యం మరియు సామాజిక భద్రత అనే నాలుగు ప్రధాన అంశాలతో ప్రస్తుత నియమాలను రూపొందిస్తున్నామని అపూర్వ చంద్ర చెప్పారు.