Begin typing your search above and press return to search.
రేవంత్ రెడ్డికి షాకిచ్చిన మోడీ సర్కార్
By: Tupaki Desk | 25 April 2021 11:30 AM GMTదేశంలో ఇప్పుడు కరోనా విషయంలో మోడీ సర్కార్ వైఫల్యాన్ని ప్రశ్నిస్తే వారి గొంతులు నొక్కేస్తున్న పరిస్థితి నెలకొందని వారంతా ఆరోపిస్తున్నారు. కరోనా మహమ్మారి నిర్వహణలో మోడీ సర్కార్ విఫలమైందంటూ సుప్రీంకోర్టు, హైకోర్టులు తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నాయి. ప్రతిపక్షాలు సైతం ప్రధాని మోడీపై దుమ్మెత్తిపోస్తున్నాయి. సోషల్ మీడియాలోనూ పెద్ద ఎత్తున మోడీ సర్కార్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో కేంద్రప్రభుత్వం దీనిపై సీరియస్ అయ్యింది.
కేంద్రం తీరును తప్పుపడుతూ దేశంలోని రాజకీయ పార్టీల నేతలు, సెలబ్రెటీలు, సాధారణ పౌరులు సైతం విమర్శనాత్మక ట్వీట్లు చేస్తున్నారు. అయితే పరిస్థితి ఆందోళనకరంగా ఉన్న వేళ అలాంటి ట్వీట్లు ప్రజలను మరింత గందరగోళానికి గురిచేస్తాయని కేంద్రం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ మేరకు ట్వీట్లను తొలగించాలంటూ ట్విట్టర్ సంస్థకు ఫిర్యాదు చేసింది. ఐటీ చట్టం ప్రకారం చర్యలు కోరింది. దీంతో ట్విట్టర్ సంస్థ ఏకంగా 52 ట్వీట్లను బ్లాక్ చేసింది.
ఈ నిషేధిత జాబితాలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డితోపాటు పశ్చిమ బెంగాల్ మంత్రి మోలాయ్ ఘటక్, నటుడు వినీత్ కుమార్ సింగ్ , ఫిల్మ్ మేకర్లు వినోద్ కాప్రీ, అవినాష్ దాస్ తదితరుల ట్వీట్లు సైతం బ్లాక్ అయ్యాయి.
కరోనా రెండో దశ వ్యాప్తిలో మోడీ సర్కార్ ఫెయిల్యూర్ పై ప్రభుత్వ వాదన కంటే వ్యతిరేక పోస్టులే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీన్ని అడ్డుకట్ట వేసేందుకు మోడీ సర్కార్ సోషల్ మీడియాపై నిఘాను పెంచింది. ఎంపీలు, మంత్రులు, సెలబ్రెటీలు చేసిన 52 ట్వీట్లపై నిషేధం విధించారు. సోషల్ మీడియాలో కేంద్రం నిషేధం విధించడం గత మూడు నెలల్లో ఇది రెండోసారి కావడం గమనార్హం. గతంలో రైతులు చేస్తున్న ఉద్యమానికి మద్దతుగా పోస్టులు పెట్టిన వారిని నిషేధం విధించేలా కేంద్రం చేసింది.