Begin typing your search above and press return to search.
ఏపీకి షాకిచ్చిన మోడీ సర్కార్.. పోలవరానికి మొండిచేయి!
By: Tupaki Desk | 22 Oct 2020 6:45 AM GMTఎందుకో తెలీదు కానీ ఏపీ విషయంలో మోడీ సర్కారు తీసుకునే నిర్ణయాలు.. రాష్ట్రానికి శాపంగా మారుతుంటాయి. విభజన వేళలో.. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ మాట ఇచ్చినప్పటికీ.. ఆయన తర్వాత ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మోడీ మాత్రం అందుకు ససేమిరా అనటం తెలిసిందే. ఢిల్లీని తలదన్నే రాజధానిని నిర్మిస్తామని చెప్పినా.. అందుకు మోడీ సర్కారు విడుదల చేసిన నిధులు ఎన్ని అన్న విషయం తెలిసిందే. ఇవన్నీ సరిపోవన్నట్లుగా ఏపీకి వరప్రదాయినిగా చెప్పే పోలవరం ప్రాజెక్టు విషయంలో దిమ్మ తిరిగేలా షాకింగ్ నిర్ణయం తీసుకుంది.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణం.. పునరావాస వ్యవయం మొత్తం కలిపి రూ.20.39వేల కోట్లు మాత్రమేనని తేల్చేసింది. జాతీయ ప్రాజెక్టు హోదా ఉన్న ఈ ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని 2013-14లో పేర్కొన్న మొత్తానికే పరిమితం చేసింది. ఒక జాతీయ ప్రాజెక్టుకు సంబంధించి వ్యయం మొత్తం కేంద్రం పెట్టుకోవాల్సి ఉండగా.. అందుకు భిన్నంగా తనదైన రీతిలో వ్యవహరించిన మోడీసర్కారు.. తన తాజా నిర్ణయంతో ఏపీకి మొండిచేయి చూపించిందని చెప్పాలి.
2013లో కొత్తగా వచ్చిన భూసేకరణ.. పునరావాస చట్టం ప్రకారం పరిహారం ఖర్చు భారీగా పెరిగింది. దీంతో.. ప్రాజెక్టు తుది అంచనా వ్యయం రూ.55.54వేల కోట్లుగా లెక్క కట్టారు. ఈ వ్యయాన్ని 2019లో కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సాంకేతిక సలహా కమిటీ ఓకే చెప్పింది. ఎన్నికల్లో విజయం అనంతరం.. మోడీ సర్కారు స్వరం పూర్తిగా మారింది.
ప్రాజెక్టును ఓకే చెప్పినప్పుడు ఎంత వ్యయం అవుతుందో నాటి ప్రభుత్వం లెక్క కట్టిందో.. అంతే మొత్తాన్నితాను ఇవ్వనున్నట్లుగా తేల్చేసింది. ప్రాజెక్టుకు పచ్చ జెండా ఊపటం.. ఆ తర్వాత చోటుచేసుకున్న పరిణామాల్ని పట్టించుకోకుండా సాయంలో కోత పెట్టాలన్న ఆలోచనే.. ఏపీ ప్రయోజనాల్ని దెబ్బ తీసేలా ఉందన్న మాట వినిపిస్తోంది.
ఇప్పుడు కేంద్రం చెప్పిన లెక్క ప్రకారం చూస్తే.. ఈ ప్రాజెక్టుకు అయ్యే భారీ మొత్తం ఏపీ సర్కారు మీద పడనుంది. తాజాగా కేంద్రం తీసుకున్న నిర్ణయంతో ప్రాజెక్టును పూర్తి చేయటం అసాధ్యంగా చెబుతున్నారు. అలా అని రాష్ట్ర నిధులతో పూర్తి చేసే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో కేంద్రంతో పోరాటం తప్పించి మరో మార్గం లేదని చెప్పక తప్పదు.