Begin typing your search above and press return to search.
ఆ వీడియోల్ని విడుదల చేశారు సరే.. వివరాల మాటేంటి మోడీ సర్కార్?
By: Tupaki Desk | 13 Aug 2021 3:39 AM GMTగడిచిన రెండు మూడు రోజులుగా లోక్ సభ.. రాజ్యసభల్లో విపక్షాలు వ్యవహరిస్తున్న వైనంపై పెద్ద ఎత్తున చర్చ జరగటం.. రాజ్యసభకు ఛైర్మన్ గా వ్యవహరిస్తున్న వెంకయ్య నాయుడు కన్నీళ్లు పెట్టుకోవటం.. తీవ్రమైన ఆవేదనను వ్యక్తం చేస్తూ.. ఆగ్రహాన్ని ప్రదర్శించటం తెలిసిందే. ఇదిలా ఉండగా.. ఈ ఎపిసోడ్ కు కొనసాగింపు అన్నట్లుగా.. రాజ్యసభలో విపక్షాలు చేసిన రగడకు సంబంధించిన వీడియోల్ని తాజాగా విడుదల చేసింది కేంద్రప్రభుత్వం.
ఈ వీడియోల్లో భద్రతా సిబ్బందిపై రాజ్యసభ సభ్యులే దాడి చేసే విజువల్స్ ఉన్నాయి. ఈ వీడియోలు ఇప్పుడు సంచలనంగా మారాయి. విపక్షాల్ని ఆత్మరక్షణలో పడేలా చేశాయి. అయితే.. ఈ వ్యవహారంపై పలువురు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. కేంద్రం తన దగ్గర ఉన్న డేటాను విడుదల చేయటమే ప్రజాస్వామ్యం అనుకుంటే.. పెగాసస్ నిఘా పై విపక్షాలు ఇంతలా ఆందోళన చేస్తున్నా.. వారి సందేహాల్ని తీర్చేలా చర్చను ఎందుకు షురూ చేయరు? వివరాలు ఎందుకు విడుదల చేయరు? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఇదిలా ఉంటే.. మరోవైపు కేంద్రం విడుదల చేసిన వీడియోలలో విపక్ష నేతలు మహిళా మార్సల్స్ పై దాడి చేస్తున్న వైనం కనిపిస్తోంది. విపక్ష నేతల తీరుపై రాజ్యసభ ఛైర్మన్ గా వ్యవహరిస్తున్న వెంకయ్య మాత్రమే కాదు.. కేంద్రమంత్రులు సైతం విరుచుకుపడ్డారు. ఇదంతా బాగానే ఉన్నట్లు కనిపిస్తున్నా.. విపక్ష నేతల ఇమేజ్ ను డ్యామేజ్ చేసేలా తాజా వీడియోలు ఉన్నట్లు విమర్శిస్తున్నారు. కేంద్రం తనకు అనుకూలంగా ఉండే క్లిప్పులను.. విపక్షాలు డిఫెన్సులో పడే వివరాల్నే వెల్లడిస్తున్నారని.. జరిగింది జరిగినట్లుగా వెల్లడిస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
రాజ్యసభలో మహిళా మార్షల్స్ పై దాడి జరుగుతున్న వీడియోల్ని యుద్ధ ప్రాతిపదికన విడుదల చేసిన ప్రభుత్వం.. అంతే స్పీడ్ గా విపక్షాలు కోరిన వివరాల్ని ఎందుకు ప్రకటించరు? ఎందుకు వాటిపై సభలో చర్చను నిర్వహించరు? అన్న ప్రశ్నలకు సమాధానాలు రాని పరిస్థితి. సంచలన అంశాలపై చర్చ ఉండదు కానీ.. విపక్షలను డ్యామేజ్ చేసేందుకు అవసరమైన వీడియోల్ని మాత్రం విడుదల చేస్తున్నారన్న విమర్శ విపిస్తోంది. మరి.. దీనికి అధికారపక్షం ఏమని సమాధానం ఇస్తుందన్నది ఒక ప్రశ్న అయితే.. మహిళా మార్షల్స్ పై ఎంపీలు దాడి చేసిన క్లిప్పులకు సంబంధం ఉన్న వారు బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. అసలేం జరిగిందో మీడియా ముందుకు వచ్చి చెప్పటం మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.