Begin typing your search above and press return to search.

మోడీ.. మీ రాజ్యంలోనూ ఇదే ఆరాచ‌క‌మా?

By:  Tupaki Desk   |   12 May 2019 1:30 AM GMT
మోడీ.. మీ రాజ్యంలోనూ ఇదే ఆరాచ‌క‌మా?
X
లోక‌ల్ టాలెంట్ ను ప‌ట్టించుకోక‌పోవ‌టం.. ఎక్క‌డైనా పైర‌వీల‌కు మాత్ర‌మే ప‌ని జ‌ర‌గ‌టం.. ఆశ్రిత ప‌క్ష‌పాతం.. అవినీతి.. ఇలా చెప్పుకుంటూ స‌వాల‌చ్చ అవ‌ల‌క్ష‌ణాల‌తో కునారిల్లే స‌మాజాన్ని.. త‌నదైన పాల‌న‌తో మొత్తంగా మార్చేస్తార‌న్న భావ‌న క‌లిగించిన నేత‌గా న‌రేంద్ర‌మోడీని చెప్పాలి. ఆయ‌న లాంటి వ్య‌క్తి ప్ర‌ధాన‌మంత్రి అయితే.. దేశంలో పెను మార్పులు చోటు చేసుకుంటాయ‌ని.. పాల‌న‌లోనూ కొత్త త‌ర‌హా విధానాల్ని ప్ర‌వేశ పెడ‌తార‌న్న న‌మ్మ‌కం ఉండేది. కానీ.. అదేమీ ఉండ‌ద‌ని.. యూపీఏకు.. ఎన్డీయేకు పెద్ద తేడా ఏమీ లేద‌న్న విష‌యం కొన్ని సంద‌ర్భాల్లో అదే ప‌నిగా అర్థ‌మ‌య్యే ప‌రిస్థితి.

తాజా ఉదంతాన్ని చూస్తే.. ఈ విష‌యం నిజ‌మేన‌న్న భావ‌న మ‌రోసారి క‌లుగ‌క మాన‌దు. ప‌ర్యావ‌ర‌ణానికి మేలు చేసేలా నీళ్ల‌తో (డిస్టిల్డ్ వాట‌ర్)తో న‌డిచే ఒక కొత్త రైలు ఇంజిన్ ను క‌నిపెట్టిన‌ట్లుగా త‌మిళ‌నాడుకు చెందిన ఇంజినీర్ సౌంతిరాజ‌న్ కుమార‌స్వామి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు.ఈ రైలు ఇంజిన్ హైడ్రోజ‌న్ ను ఇంధ‌నంగా చేసుకొని ఆక్సిజ‌న్ ను విడుద‌ల చేస్తుంద‌ని వెల్ల‌డించారు.

ప్ర‌పంచంలో ఈ త‌ర‌హా రైల్ ఇంజిన్ ను ఎవ‌రూ త‌యారు చేయ‌లేద‌ని.. దాన్ని అభివృద్ధి చేయ‌టానికి త‌న‌కు ప‌దేళ్ల స‌మ‌యం ప‌ట్టిన‌ట్లు పేర్కొన్నారు. ఈ ఇంజిన్ ను ఇండియాలోనే ఆవిష్క‌రించాల‌ని త‌న క‌ల‌గా చెప్పారు. దుర‌దృష్ట‌వ‌శాత్తు.. తానీ విష‌యాన్ని చెబుతూ ఎంతోమందిని క‌లిశాన‌ని.. కానీ ఎవ‌రి నుంచి ఎలాంటి స్పంద‌న రాలేద‌న్నారు.

దీంతో త‌న ప్రాజెక్టు గురించి జ‌పాన్ ప్ర‌భుత్వాన్ని సంప్ర‌దించ‌టంతో వారు త‌న ఇంజిన్ ను ఆవిష్క‌రించ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. త‌మిళ‌నాడులోని కోయంబ‌త్తూర్ కు చెందిన ఈ ఔత్సాహిక ఇంజిన్ మీడియా స‌మావేశంలో ఈ సంచ‌ల‌న విష‌యాన్ని వెల్ల‌డించారు. లోక‌ల్ టాలెంట్ ను అక్క‌డెక్క‌డో ఉన్న జ‌పాన్ ప్ర‌భుత్వం గుర్తించ‌ట‌మేంది? మేకిన్ ఇండియా ప్రాజెక్టును ఘ‌నంగా చాటుకునే మోడీ స‌ర్కారు దృష్టికి వెళ్ల‌క‌పోవటం ఏంది? ఈ లెక్క‌న మోడీ మాష్టారి రాజ్యంలో లోక‌ల్ టాలెంట్ కు ఎంతటి గుర్తింపు ద‌క్కుతుందన‌టానికి ఇదో మంచి ఉదాహ‌ర‌ణ‌గా చెప్పొచ్చా?