Begin typing your search above and press return to search.
జగన్ రిక్వెస్టును ఓకే చేసిన మోడీ సర్కార్
By: Tupaki Desk | 8 Aug 2020 3:30 AM GMTప్రధానమంత్రి మోడీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిత్యం సుద్దులు చెబుతూనే.. రాజకీయంగా ఆయన ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ఎలా ఉంటాయన్న విషయం ఇప్పటికే దేశ ప్రజలకు బాగానే అర్థమైంది. విలువలు.. సిద్దాంతాలు వల్లె వేస్తూనే.. తన రాజకీయ ఎజెండాను ఎలా అమలు చేస్తారన్నది కర్ణాటక.. మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ఇప్పటికే చూడటం మర్చిపోలేం. కొన్ని అంశాల విషయంలో సానుకూలంగా స్పందించటం.. మరికొన్ని విషయాల్లో ఆయా రాష్ట్రాలకు షాకిచ్చేలా చేయటం మోడీ సర్కారుకు అలవాటుగా మారిందన్న విమర్శ తరచూ వినిపిస్తూ ఉంటుంది.
తమ ప్రభుత్వం మీద వేలెత్తి చూపించే వేటికి సమాదానం ఇవ్వని నేర్పు మోడీ సొంతమని చెప్పాలి. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఏపీ విషయంలో ఆయన తీరు కాస్త భిన్నంగా ఉంటుంది. ఏప ప్రజలకు మేలు జరిగే నిర్ణయాల విషయంలో పెద్దగా పట్టని ఆయన.. అదే సమయంలో ఏపీ సర్కారు కోరినంతనే.. వారి విన్నపాలపై సానుకూలంగా స్పందించే ధోరణి కనిపిస్తుంటుంది.
ఈ మధ్యన ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని పదవీ కాలాన్ని పెంచాలంటూ ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కోరటం తెలిసిందే. వాస్తవానికి ఆమె ఈ ఏడాది జూన్ లోనే పదవీ విరమణ చేయాల్సి ఉంది. కానీ.. పొడిగింపు కోరటంతో మోడీ సర్కారు సానుకూలంగా స్పందిస్తూ.. ఏపీ ముఖ్యమంత్రి కోరినట్లే చేసింది. షెడ్యూల్ ప్రకారం వచ్చే నెలలో ఆమె పదవీ విరమణ చేయాల్సి ఉంది. ఈలోపే.. ఏపీ సర్కారు ఆమె పదవీ కాలాన్ని మరో మూడు నెలలు పొడిగించాలని కోరుతూ లేఖ రాశారు.
తాజాగా జగన్ సర్కారు కోరినట్లే.. నీలం సాహ్ని పదవీ కాలాన్ని డిసెంబరు 2020 వరకు పొడిగిస్తూ కేంద్రం తాజా నిర్ణయాన్ని తీసుకుంది. దీంతో.. ఆమె డిసెంబరు 31 వరకు ఏపీ ప్రధాన కార్యదర్శి పదవిలో కొనసాగనున్నారు. అనుకుంటాం కానీ.. ఏపీ ముఖ్యమంత్రి నోరు తెరిచి అడగాలే కానీ.. ఇప్పటివరకు ప్రధాని మోడీ కాదన్నది ఏముంది చెప్పండి?