Begin typing your search above and press return to search.
బీజేపీ గేమ్ ఛేంజర్ కాదు.. నేమ్ ఛేంజర్
By: Tupaki Desk | 5 Feb 2018 5:12 PM GMTప్రధానమంత్రి నరేంద్ర మోడీ - బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సహా...ఆ పార్టీ నేతలపై కాంగ్రెస్ నాయకుడు - రాజ్యసభలో ప్రతిపక్ష నేత గులామ్ నబీ ఆజాద్ భారీ సెటైర్ వేశారు. అమిత్ షా రాజ్యసభలో మొదటిసారిగా ప్రసంగిస్తూ... `2013 వరకు దేశం ఎలాంటి పరిస్థితుల్లో ఉందో అందరికీ తెలుసు. ఓ విధానం లేదు. ఆర్మీ తమ అసలైన పరాక్రమం చూపించకుండా వాళ్ల చేతులు కట్టేశారు. కానీ ఈ మూడున్నరేళ్లలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. మోడీ ముందుగా చెప్పినట్లే పేదలు - రైతులు - వెనుకబడిన వర్గాల కోసం కృషి చేస్తున్నారు. మూడున్నరేళ్లలో ఎన్డీయే ప్రభుత్వం చేసిన పనులు చరిత్రలో నిలిచిపోతాయి. మేం గేమ్ చేంజర్స్` అని అమిత్ షా అన్నారు. దీనిపైనే ఆజాద్ పంచ్ వేశారు.
బీజేపీ ప్రభుత్వం గేమ్ ఛేంజర్ కాదు అని, అది కేవలం నేమ్ ఛేంజర్ అని ఆజాద్ సెటైర్ వేశారు. గతంలో యూపీఏ ప్రభుత్వం మొదలుపెట్టిన అన్ని పథకాలకు బీజేపీ ప్రభుత్వం పేర్లు మారుస్తోందని ఆయన ఆరోపించారు. 1985 తర్వాత యూపీఏ ప్రారంభించిన అన్ని పథకాల పేర్లను బీజేపీ మార్చేస్తోందన్నారు. పెట్రోల్ - డీజిల్ ధరలు విపరీతంగా పెరిగినట్లు ఆయన దుయ్యబట్టారు. యూపీఏ పాలన కంటే దారుణంగా బీజేపీ పాలనలో చమురు ధరలు పెరిగినట్లు విమర్శించారు. బేటీ బచావో బేటీ పడావో పథకానికి తక్కువ నిధులు కేటాయించినట్లు ఆజాద్ తెలిపారు. కేవలం పబ్లిసిటీ కోసం మోదీ ప్రభుత్వం 550 కోట్లు ఖర్చు చేసిందన్నారు. యూపీఏ పాలనలో 24 కోట్ల బ్యాంకు అకౌంట్లు తెరిస్తే - బీజేపీ ప్రభుత్వం కేవలం 7 కోట్లు మాత్రమే కొత్త అకౌంట్లు ఇచ్చినట్లు ఆయన విమర్శించారు.
కాగా, రాజ్యసభలో తాను చేసిన తొలి ప్రసంగంలోనే కాంగ్రెస్ పై ఘాటైన విమర్శలు చేశారు బీజేపీ అధ్యక్షుడు - ఎంపీ అమిత్ షా. ఈ నాలుగేళ్లలో మోడీ ప్రభుత్వం చేసిన పనులపై ప్రశంసలు కురిపించారు. దేశంలో పేదలు పకోడాలు అమ్ముకొని బతకాలా అని కాంగ్రెస్ నేత చిదంబరం చేసిన విమర్శలను అమిత్ షా దీటుగా తిప్పికొట్టారు. నిరుద్యోగిగా ఉండే కంటే.. పకోడాలు అమ్ముకొని తలెత్తుకొని జీవించడం చాలా బెటర్ అని షా అన్నారు. అయినా ఓ చాయ్ వాలా దేశ ప్రధాని కాగలిగినప్పుడు.. ఇప్పుడు పకోడాలు అమ్ముకునే వారి పిల్లలు కూడా భవిష్యత్తులో అద్భుతాలు చేస్తారంటూ అమిత్ షా చెప్పారు.