Begin typing your search above and press return to search.
గోల్డ్ డిపాజిట్.. వారంలో 400 గ్రాములేనా?
By: Tupaki Desk | 20 Nov 2015 6:53 AM GMTకేంద్రం ఇటీవల ప్రవేశపెట్టిన బంగారం డిపాజిట్ స్కీం పరిస్థితి చూస్తుంటే చిన్నప్పుడు చదువుకున్న బంగారు బాతు గుడ్డు కథ గుర్తుకొస్తోంది. ఒక ఆశపోతు రైతు వద్ద ఉన్న బాతు రోజుకో బంగారు గుడ్డు పెడుతుంది... ఒక రోజు రైతుకు దురాశ పుడుతుంది. రోజుకో బంగారు గుడ్డు పెడుతున్న బాతు కడుపును కోసేస్తే అందులో ఉన్న బంగారు గుడ్లన్నీ ఒకేసారి తీసుకోవచ్చు కదా అనుకుంటాడు... అనుకున్నదే తడవుగా కత్తితో బాతు కడుపును కోస్తాడు.. కానీ, అందులో ఆ రోజు పెట్టాల్సిన గుడ్డు తప్ప అదనంగా ఒక్కటి కూడా ఎక్కువ ఉండదు. దీంతో రైతుకు ఏడుపు తప్ప ఏమీ మిగలదు... బాతు కూడా చచ్చిపోవడంతో మరుసటి రోజు నుంచి రోజుకో బంగారు గుడ్డు కూడా లేకుండా పోతుంది.
దీంతో ఉన్నదీ ఉంచుకున్నదీ రెండూ పోతాయి రైతుకు. ఇప్పు డు కేంద్రం ప్రవేశ పెట్టిన బంగారం డిపాజిట్ పథకం కూడా దాదాపుగా ఇలాగే ఉంది. ఎంతో ఘనంగా ప్రవేశపెట్టిన ఈ పథకంతో దేశవ్యాప్తంగా వారం రోజుల్లో డిపాజిట్టయిన బంగారమెంతో తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. వారంలో కేవలం 400 గ్రాములు అంటే అరకేజీ కంటే తక్కువ బంగారం డిపాజిట్టయింది. దేశప్రజల ఇళ్లలో టన్నుల కొద్దీ బంగారం ఉన్నా బ్యాంకులకు చేరింది అందులో పిసరంతే కావడం విశేషం.
ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన గోల్డ్ డిపాజిట్ స్కీంకు పెద్ద స్పందన కనిపించడం లేదు. వారం క్రితం అట్టాహాసంగా మొదలుపెట్టిన ఈ పథ కం ద్వారా కేవలం 400 గ్రాములనే ఆకర్షించగలిగింది. ప్రభుత్వం దేశవ్యాప్తంగా సుమారు 20వేల టన్నుల మూలుగుతోందని అంచనా వేసింది. ప్రధానిమోడీ గృహాల్లో, దేవాలయాల్లో ఉన్న బంగారాన్ని తీసుకొచ్చి బ్యాంకుల్లో డిపాజిట్ చేసిదానిపై ఆకర్షణీయమైన వడ్డీ సంపాదించుకోండ ని ఆఫర్ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో పాటు ప్ర భుత్వం గోల్డ్ బాండ్‌లను ప్రారంభిం చింది. అయితే, డిపాజిట్టయింది మాత్రం రవ్వంతే.
దీనికి ప్రధాన కారణం బంగారాన్ని మదుపు చేసే సెంటర్ల కొరతే అని.. దీనిపై ప్రభుత్వం దృష్టి పెట్టడానికి అంగీకరించిందని అనిల్ సంకేవాల్ జెమ్స్ అండ్ జ్యువెలరీ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ చెబుతున్నారు. గురువారం ఆర్థికమంత్రిత్వశాఖ అధికారు లను కలిసిన తర్వాత ఆయన ఇప్పటి వరకు 400 గ్రాముల బంగారం డిపాజిట్ అయందని చెప్పారు. ప్రభుత్వం దీనిపై దృష్టిపెట్టి బంగారంపరీక్షల సెంటర్‌లను డిపాజిట్ బ్యాంకులను ఎక్కువ మొత్తంలో ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటుందని చెప్పారు.
భారతీయులకు పసిడితో అవినాభావసంబంధం ఎక్కువ. పసిడికి ఎనలేని విలువ ఇస్తారు. పెళ్లిళ్లలో కట్నం కింద పేదవాడు కూడా ఎంతో కొంత కొనుగోలు చేస్తుంటాడు. అవసరానికి ఆర్థికంగా ఆదుకుంటుందన్న ఆలోచనలో చాలా మంది బంగారం కొనుగోలు చేసి ఉంచుకుంటారు. పన్నుల నుంచి తప్పించుకోవడానికికూడా పసిడి కొనుగోలు చేసి లాకర్లలో ఉంచుకుంటారు. మోడీ ప్రభుత్వం దేశంలో ఉన్న 20 వేలటన్నుల బంగారాన్ని చలామణిలోకి తెచ్చి దాని ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థను పురోగతిలోకి తీసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నా.. ప్రజలకు బంగారంతో ఉన్న సెంటిమెం ట్‌ను దృష్టిలో ఉంచుకుని వారిని ఒప్పించి బ్యాంకు ల్లో డిపాజిట్ చేయించడం మోడీ ప్రభుత్వానికి అతి పెద్దసవా లేనని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతు న్నారు. దీంతో ఈ ఏడాది చివరి నాటికి 55 పరీక్షా కేంద్రాలు... 20 రిఫైనరీలను ప్రభుత్వం ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉంది. అప్పుడైనా పెట్టెలోని బంగారం బ్యాంకుల్లోకి వస్తుందో లేదో చూడాలి.