Begin typing your search above and press return to search.

మోదీపై జ‌నాగ్ర‌హం!... వైర‌ల్ గా #మోదీ గోబ్యాక్!

By:  Tupaki Desk   |   10 Feb 2019 7:03 AM GMT
మోదీపై జ‌నాగ్ర‌హం!...  వైర‌ల్ గా #మోదీ గోబ్యాక్!
X
ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ ఏపీ టూర్ సంద‌ర్భంగా ప‌లు రాజ‌కీయ పార్టీలు, ప్ర‌జా సంఘాల‌తో పాటు జ‌నం తీవ్ర స్థాయిలో ఆగ్ర‌హావేశాలు వ్య‌క్తం చేస్తున్నారు. రాష్ట్రానికి కేంద్ర ప్ర‌భుత్వం చేసిన అన్యాయం కార‌ణంగా జ‌నంలో స్వ‌చ్ఛందంగానే నిర‌స‌న పెల్లుబికింద‌ని చెప్పాలి. తెలుగు నేల విభ‌జ‌న త‌ర్వాత తీవ్ర ఆర్థిక ఇబ్బందుల‌తో కొత్త ప్ర‌యాణం ప్రారంభించిన న‌వ్యాంధ్ర‌ను అన్ని విధానాలుగా ఆదుకుంటామ‌ని, ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇస్తామ‌ని హామీ ఇచ్చిన మోదీ... ఆ హామీ అమ‌లులో ఆస‌క్తి చూప‌క‌పోగా... నూత‌న రాజ‌ధాని అమ‌రావ‌తి శంకుస్థాప‌న‌కు వ‌చ్చిన సంద‌ర్భంగా పిడికెడు మ‌ట్టి, కుండ నీళ్లు ఇచ్చేసి వెళ్లిపోయారు. ఆ త‌ర్వాత రాజ‌ధాని నిర్మాణానికి నిధుల విడుద‌ల‌లోనూ తీవ్ర నిర్ల‌క్ష్యం చేశారు. ఏపీకి నిధులు ఇవ్వాలంటే లెక్క‌లేన‌న్ని కండీష‌న్లు పెట్టిన మోదీ స‌ర్కారు... ఏపీకి నిజంగానే తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టేసింది.

ఏపీకి జీవ‌నాడిగా ప‌రిగ‌ణిస్తున్న పోలవ‌రం ప్రాజెక్టుకు నిధుల విడుద‌ల‌లోనూ ఆస‌క్తి చూప‌ని మోదీ... మొత్తంగా ప్రాజెక్టుకు ఎక్క‌డిక‌క్క‌డ అడ్డుపుల్ల‌లు వేశార‌ని చెప్పాలి. అయితే ఎలాగోలా స‌ద‌రు ప్రాజెక్టు ప‌నులు ఆగ‌కుండా చూసుకోవ‌డంతో పాటు ప‌నుల్లో ఎప్పిక‌ప్పుడు వేగాన్ని పెంచుతూ పోతున్న చంద్ర‌బాబు స‌ర్కారు... మోదీ స‌ర్కారుకు ధీటుగానే స్పందిస్తున్నారు. మొత్తంగా ఏపీకి శ‌ని గ్ర‌హంలా మారిన మోదీపై రాష్ట్ర ప్ర‌జ‌లు తీవ్ర ఆగ్ర‌హావేశాల‌తో ఉన్నారు. ఈ నేప‌థ్యంలో నేటి ఉద‌యం గుంటూరు స‌భ‌లో పాలుపంచుకునేందుకు మోదీ వ‌చ్చిన నేప‌థ్యంలో నిన్న‌టి నుంచే మోదీ ప‌ర్య‌ట‌న‌ను వ్య‌తిరేకిస్తూ సోష‌ల్ మీడియాలో జ‌నం భారీ ఎత్తున నిర‌స‌న‌లు వ్య‌క్తం చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ట్విట్ట‌ర్ లో మోదీ ప‌ర్య‌ట‌న‌ను వ్య తిరేకిస్తూ... #మోదీ గో బ్యాక్ పేరిట ఓ కొత్త హ్యాష్ ట్యాగ్ ఎంట్రీ ఇచ్చింది.

మోదీ టూర్‌కు స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డుతున్న కొద్తీ ఈ హ్యాష్ ట్యాగ్‌కు జాయిన్ అవుతున్న వారి సంఖ్య అంత‌కంత‌కూ పెరిగింది. ఇక మోదీ గుంటూరులో అడుగుపెట్టిన త‌ర్వాత ఈ సంఖ్య ఒక్క‌సారిగా భారీగా పెరిగిపోయింది. మోదీ నోట నుంచి వ‌స్తున్న ప్ర‌తి మాట‌కూ స్పందించిన ఏపీ ప్ర‌జ‌లు ఈ హ్యాష్ ట్యాగ్ ద్వారా త‌మ ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే... మోదీ గ‌న్న‌వ‌రం ఎయిర్ పోర్టులో దిగి గుంటూరుకు హెలికాఫ్ట‌ర్లో బ‌యలుదేరి స‌భావేదిక‌కు కాస్తంత దూరంలో ల్యాండై అక్క‌డి నుంచి కారులో స‌భా వేదిక‌కు చేరుకునేందుకు ఏర్పాట్లు జరిగాయి. ఈ దారిలో మోదీకి త‌మ నిర‌స‌న తెల‌సేలా... పెద్ద ఎత్తున హోర్డింగులు వెలిశాయి. మోదీ గో బ్యాక్‌, నో మోదీ, మోదీ నో ఎంట్రీ, మోదీ నెవ‌ర్ అగైన్ అంటూ పెద్ద పెద్ద అక్ష‌రాల‌తో కూడిన వెల‌సిన ఈ హోర్డింగులు ఇప్పుడు ఆస‌క్తిని రేకెత్తిస్తున్నాయి. మొత్తంగా మోదీ గుంటూరును టూర్‌ను నిర‌సిస్తూ... జ‌నం స్పందిస్తున్న తీరుకు #మోదీ గో బ్యాక్ హ్యాష్ ట్యాగ్ అద్దం ప‌డుతోంది.