Begin typing your search above and press return to search.

మోడికి వార్నింగిచ్చిన మఠాధిపతులు

By:  Tupaki Desk   |   22 July 2021 7:07 AM GMT
మోడికి వార్నింగిచ్చిన మఠాధిపతులు
X
కర్నాటక రాజకీయాల్లో విచిత్రమైన పరిస్దితులు కనబడుతున్నాయి. సీఎం యడ్యూరప్పగా మద్దుతగా నిలబడాల్సిన మంత్రులు, ఎంఎల్ఏలను కాదని మఠాధిపతులు ఓవర్ యాక్షన్ చేశారు. రాష్ట్రంలోని 35 మంది మఠాధిపతులు బెంగుళూరులో సమావేశమై యడ్డీని సీఎంగా తొలగించేందుకు లేదని అట్టిమేటమ్ ఇవ్వటమే విచిత్రంగా ఉంది. తమ మాటను కాదని సీఎంగా యడ్డీని తీసేస్తే 2 వేలమంది మఠాధిపతులు ఢిల్లీకి వచ్చి ఆందోళన చేస్తామని నరేంద్రమోడికి వార్నింగ్ ఇవ్వటమే ఆశ్చర్యంగా ఉంది.

మామూలుగా అయితే ఓ నేత సీఎంగా ఉండాలన్నా పక్కకుపోవాలన్నా మంత్రులు, ఎంఎల్ఏలదే కీలకపాత్రగా ఉంటుంది. ఉన్న ఎంఎల్ఏలు, మంత్రుల్లో మెజారిటి ఎవరికైతే మద్దతుగా నిలబడతారో సదరు నేతకే సీఎం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. అధిష్టానం కూడా సీఎంలను నియమించాలన్నా, తొలగించాలన్నా మంత్రులు, ఎంఎల్ఏలతోనే మాట్లాడుతుందన్న విషయం అందరికీ తెలిసిందే.

ఇపుడు యడ్డీ విషయంలో కూడా జాతీయ నాయకత్వం మంత్రులు, ఎంఎల్ఏలతో మాట్లాడింది. ఎందుకంటే యడ్యూరప్పపై అవినీతి ఆరోపణలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈరోజో రేపే ఆయన రాజీనామా చేసేస్తారనే ప్రచారం బాగా పెరిగిపోతోంది. సరిగ్గా ఇలాంటి సమయంలోనే మఠాధిపతులు జోక్యం చేసుకోవటమే ఆశ్చర్యంగా ఉంది. నిజానికి సీఎం పదవికి మఠాధిపతులకు ఎలాంటి సంబంధంలేదు. గట్టిగా మాట్లాడితే వీళ్ళ పరిధిలోని అంశంకూడా కాదు.

అయినాకానీ తగుదునమ్మా అని యడ్డీకి మద్దతుగా సమావేశం పెట్టడం, సీఎంగా తొలగించకూడదని తీర్మానం చేయటం ఆశ్చర్యంగా ఉంది. ఇంతటితో ఆగకుండా తొలగిస్తే ఢిల్లీకి వచ్చి 2 వేలమంది మఠాధిపతులతో ఆందోళనలు చేస్తామని మోడికి వార్నింగ్ ఇవ్వటమే మరింత విడ్డూరంగా ఉంది. మొత్తానికి అన్నీదారులు మూసుకుపోయిన తర్వాత యడ్యూరప్ప చివరకు మఠాధిపతులనే నమ్ముకున్నట్లుంది.