Begin typing your search above and press return to search.
కేసీఆర్ కు భారీ షాకిచ్చిన మోడీ?
By: Tupaki Desk | 28 Nov 2020 5:15 AM GMTరేటర్ ఎన్నికల వేళ.. ఎన్నికలతో సంబంధం లేని రీతిలో హైదరాబాద్ కు వస్తున్నారు ప్రధాని నరేంద్రమోడీ. కరోనా వ్యాక్సిన్ తయారు చేస్తున్న భారత్ బయోటెక్ సిద్ధం చేస్తున్న కొవాగ్జిన్ పురోగతి ఎంతవరకు వచ్చిందన్న విషయాన్ని తెలుసుకునేందుకు ఆయన స్వయంగా వస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన్ను కలుసుకునేందుకు ఎవరెవరు వస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
ముందుగా అనుకున్న దాని ప్రకారం.. ప్రధానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ స్వాగతం పలుకుతారని భావించారు. అందుకు తగ్గట్లే షెడ్యూల్ ను సిద్ధం చేసినట్లుగా తెలుస్తోంది. అనూహ్యంగా సీఎం కేసీఆర్ కు షాకిచ్చేలా తాజా షెడ్యూల్ వచ్చిందని చెబుతున్నారు. ఎన్నికలు జరుగుతున్న వేళ.. రాజకీయ విమర్శలకు అవకాశం ఇవ్వకూడదన్నట్లుగా ప్రధాని మోడీ తీరు ఉన్నట్లు చెబుతున్నారు.
తాజాగా ప్రధానమంత్రి కార్యాలయం నుంచి రాష్ట్ర సీఎస్ కు అందిన సమాచారం ప్రకారం.. కేవలం ఐదుగురు అధికారులకు మాత్రమే ప్రధానికి స్వాగతం పలికేందుకు అవకాశం ఇచ్చినట్లుగా చెబుతున్నారు. ప్రధాని మోడీ వ్యక్తిగత సహాయకుడు వివేక్.. తెలంగాణ రాష్ట్ర సీఎస్ సోమేష్ కుమార్ కు ప్రత్యేకంగా ఫోన్ చేసినట్లుగా తెలుస్తోంది.
ఈ సందర్భంగా ప్రధాని రాష్ట్రానికి వచ్చినప్పుడు సంప్రదాయం ప్రకారం రాష్ట్ర ముఖ్యమంత్రి స్వాగతం పలుకుతారని గుర్తు చేయగా.. అలాంటిదేమీ అక్కర్లేదని.. ఐదుగురు అధికారులు సరిపోతారని చెప్పినట్లుగా తెలుస్తోంది. పీఎంవో వైఖరి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఓవైపు ఎన్నికలు.. మరోవైపు కరోనా అని చెబుతున్నా.. అంతకు మించింది ఏదో ఉందన్న భావన కలుగుతోంది. ఏమైనా.. ప్రధానికి స్వాగతం పలికేందుకు ముఖ్యమంత్రి అవసరం లేదన్న సందేశాన్ని చెప్పకనే చెప్పేసిన తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
తాజాగా నిర్ణయించిన దాని ప్రకారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్.. డీజీపీ మహేందర్ రెడ్డి.. సైబరాబాద్ సీపీ సజ్జన్నార్.. మేడ్చల్ కలెక్టర్ శ్వేతా మహంతి.. హకీంపేట ఎయిర్ ఆఫీస్ కమాండెంట్ మాత్రమే ప్రధానికి స్వాగతం పలికే వారిలో ఉండటం గమనార్హం. తన హైదరాబాద్ పర్యటన ద్వారా సీఎం కేసీఆర్ కు ప్రధాని మోడీ షాకిచ్చారన్న మాట వినిపిస్తోంది.