Begin typing your search above and press return to search.
ఇండియాలో ఇంటర్వ్యూ ఇవ్వని మోడీ అమెరికా సంస్థకు ఇచ్చేశారు
By: Tupaki Desk | 20 Jun 2023 8:01 PM GMTదేశానికి తిరుగులేని ప్రధానమంత్రిగా పేరున్న నరేంద్ర మోడీలో వైరుధ్యాలు బోలెడన్ని కనిపిస్తాయి. దేశ ప్రజలతో నేరుగా సంబంధాల్ని కుదుర్చుకునేందుకు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని నిర్వహించే ఆయన.. దేశంలోని మీడియా సంస్థలో ఏడాదికి ఒకసారి కూడా భేటీ కావటం కనిపించదు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మీడియా అధినేతలతో భేటీ అవుతుంటారు మోడీ నీడగా చెప్పే అమిత్ షా. కానీ.. నరేంద్ర మోడీ మాత్రం భారత్ లోని మీడియా ప్రతినిధులతో మాత్రం భేటీ కారు. తనను ప్రశ్నలు వేసే అవకాశాన్ని ఇవ్వరు.
గతంలో ప్రధానమంత్రులు విదేశీ పర్యటనలకు వెళ్లే వేళలో.. మీడియాకు చెందిన సీనియర్ జర్నలిస్టులను తమ వెంట తీసుకెళ్లే సంప్రదాయం ఉండేది. కానీ.. మోడీ వచ్చిన తర్వాత అదంతా తగ్గిపోయింది. ఆ మాటకు వస్తే.. మీడియాను లిస్టులో నుంచి తీసేశారా? అన్నట్లుగా ఆయన తీరు ఉంటుంది.
తాజాగా అమెరికా టూర్ లో తనతో పాటు తీసుకెళ్లే ప్రతినిధి ఏ మీడియా సంస్థకు చెందిన వారో తెలుసా? పీటీఐ (ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా).
ఎందుకిలా చేస్తారు? మోడీ స్థాయికి భారత మీడియాకు చెందిన ఏ జర్నలిస్టు సరిపోరా? సాటిరారా? ఆయన్ను ప్రశ్నలు అడిగే స్థాయి మరెవరికీ ఉండదా? ఇలాంటి ప్రశ్నలు బోలెడన్ని వినిపిస్తాయి. దేశ ప్రధానిగా ఆయన తొమ్మిదేళ్లకు పైగా వ్యవహరిస్తున్నారు.
గతంలో మరే ప్రధానమంత్రి వ్యవహరించనట్లుగా ఆయన మీడియాకు.. మీడియా ప్రతినిధులకు దూరంగా ఉంటున్నారు. నిజానికి ఈ తరహా పరిస్థితి మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఎక్కువైతే.. అదిప్పుడు పీక్స్ కు చేరిపోయిందని చెప్పాలి.
భారత్ లో మరే జర్నలిస్టుకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇవ్వటానికి ససేమిరా (అతి తక్కువ సందర్భాల్లో) అనే ప్రధాని.. అమెరికా పర్యటన సందర్భంగా మాత్రం అక్కడి ప్రముఖ మీడియా సంస్థ అయితే వాల్ స్ట్రీట్ కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇదంతా చూసినప్పుడు అనిపించేది ఒక్కటే.. మోడీకి ఇంటర్వ్యూ ఇవ్వాలంటే విదేశీ జర్నలిస్టే అయి ఉండాలా? భారత్ జర్నలిస్టులకు ఆ అవకాశం ఇవ్వరా? అన్న సందేహం కలుగక మానదు.