Begin typing your search above and press return to search.
క్యాడ్ భేటీ .. చైనాకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన మోదీ
By: Tupaki Desk | 25 Sep 2021 11:30 AM GMTకొన్ని వేల మైళ్ల సముద్ర మార్గం కలిగిన నాలుగు విభిన్న ప్రజాస్వామ్య దేశాధినేతలు శుక్రవారం వైట్ హౌస్ వేదికగా సమావేశమయ్యారు. క్యాడ్ సభ్య దేశాధినేతలు మొదటిసారి ప్రత్యక్షంగా శిఖరాగ్ర సమావేశానికి హాజరయ్యారు. ప్రస్తుత కాలంలో అత్యంత క్లిష్టమైన సవాళ్లను పరిష్కరించడానికి ప్రజాస్వామ్య దేశాలు మాత్రమే కలిసి పనిచేయగలవని ముక్త కంఠంతో నినదించారు. ముఖ్యంగా ఇండో, పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛాయుత నౌకాయానం ప్రధానం అజెండాగా సమావేశం సాగింది. సమావేశంలో పాల్గొన్న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, భారత్, అమెరికా, జపాన్ ప్రధానులు నరేంద్ర మోదీ, స్కాట్ మోరిసన్, యోషిహిడే సుగాలు తమ తమ దేశాల ప్రాధాన్యతలను నొక్కిచెప్పారు.
భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఇండో-పసిఫిక్ ప్రాంతాన్ని దాటి వెళ్లి క్వాడ్‌ను ప్రపంచ శ్రేయస్సు కోసం ఒక శక్తిగా అభివర్ణించారు. ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ ఇండో పసిఫిక్ ప్రాంతంలో స్వేచ్ఛాయుత నౌకాయానం కోరుకుంటున్నామని చైనా పై పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ఇక జపాన్ జపాన్ ప్రధాని సుగా అమెరికాతో ద్వైపాక్షిక వాణిజ్య సమస్య, జపాన్ బియ్యం, ఆహార ఉత్పత్తుల ఎగుమతులను ప్రస్తావించారు. వీటిపై నిషేధం ఎత్తివేసినందుకు ఆమెరికాకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ క్యాడ్ దేశాల విద్యార్థుల కోసం స్టెమ్ ఫెలోషిప్‌ను ప్రకటించారు. ప్రపంచ శ్రేయస్సు కోసం క్యాడ్ ఓ శక్తిగా పనిచేస్తుందని స్పష్టం చేశారు.
అంతరిక్షం, ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి, వాతావరణ మార్పులు, కోవిడ్-19పై పోరులో సహకారం తదితర అంశాలపై చర్చించారు. 5G టెక్నాలజీ, వాతావరణ మార్పులు, క్లిష్టమైన మౌలిక సదుపాయాలు, సరఫరా గొలుసులు వంటి రంగాలు సహా ప్రత్యక్ష సైనిక సహకారం గురించి క్యాడ్ ఉమ్మడి ప్రకటనను విడుదల చేయనుంది. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో సహాయక సహకారాల కోసం 2004లో సునామీ వచ్చిన తర్వాత మా నాలుగు దేశాలు కూటమిగా ఏర్పడి మొదటిసారి కలుసుకున్నాయి. ఈ రోజున ప్రపంచం కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా పోరాడుతున్నప్పుడు, మానవజాతి సంక్షేమం కోసం మేము మరోసారి క్వాడ్‌గా ఇక్కడకు వచ్చాం అని మోదీ అన్నారు.
క్యాడ్ సమావేశంలో ప్రారంభోపన్యాసం చేసిన బైడెన్.. అమెరికా, భారత్, ఆస్ట్రేలియా, జపాన్ నాలుగు ప్రజాస్వామ్య దేశాలు కోవిడ్ నుంచి వాతావరణ మార్పులు వంటి ఉమ్మడి సవాళ్లను సంయుక్తంగా ఎదుర్కొంటామని తెలిపారు. సవాళ్లను ఎదుర్కొని పనులను ఎలా పూర్తి చేయాలో మాకు తెలుసు అని వ్యాఖ్యానించారు. అంతర్జాయతీ చట్టాలకు అనుగుణంగా ఇండో-పసిఫిక్ ప్రాంతంలో వివాదాలను పరిష్కరించి, స్వేచ్ఛ, శాంతిని నెలకొల్పాలని ఆస్ట్రేలియా ప్రధాని మోరిసన్ కోరారు.