Begin typing your search above and press return to search.

మోడీ వారి ఫారిన్ టూర్ పద్దు కాస్త గట్టిదే బాసూ

By:  Tupaki Desk   |   22 Nov 2019 4:33 AM GMT
మోడీ వారి ఫారిన్ టూర్ పద్దు కాస్త గట్టిదే బాసూ
X
ఇప్పటివరకూ దేశ ప్రధానులుగా పని చేసిన వారెవరూ చేయని పనిని ప్రధాని మోడీ తన హయాంలో చేస్తున్నారని చెప్పాలి. ప్రపంచంలోని పలు దేశాల్లో పర్యటించే విషయంలో గత ప్రధానుల రికార్డుల్ని బ్రేక్ చేశారని చెప్పాలి. చాలా దేశాలకు అసలు వెళ్లని గత ప్రధానుల తీరుకు భిన్నంగా ఆయన వెళ్లటమే కాదు.. విదేశీ ప్రయాణాల విషయంలో ఆయన జోరు ఎక్కువన్న మాట వినిపిస్తూ ఉంటుంది.

వరుస పెట్టి ఒక్కో ట్రిపులో రెండు.. మూడు దేశాలకు వెళ్లి వచ్చే మోడీ.. భారత ఇమేజ్ ను పెంచేందుకు విపరీతంగా కష్టపడుతున్నట్లుగా బీజేపీ నేతలు చెబుతుంటారు. గడిచిన పాతికేళ్లలో వెళ్లని చాలా దేశాల్ని తన మెదటి టర్మ్ లో కవర్ చేసిన ప్రధాని.. రెండో టర్మ్ లోనూ అదే ఊపును కొనసాగిస్తారన్న అభిప్రాయం ఉంది.

తాజాగా ప్రధాని మోడీ విదేశీ పర్యటనల కోసం పెట్టిన ఖర్చుకు సంబంధించిన లెక్కల వివరాల్ని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. గడిచిన మూడేళ్లలో ప్రధాని మోడీ ఫారిన్ ట్రిప్పుల కోసం దాదాపు రూ.255 కోట్ల మేర ఖర్చు వచ్చినట్లు వెల్లడించారు. అది కూడా విమానాలకు అయిన ఖర్చు కావటం గమనార్హం.

గడిచిన మూడేళ్లు (2016-19)లో ఆయన జరిపిన విదేశీ పర్యటనల కోసం వినియోగించిన చార్టర్ విమానాల కోసం రూ.255 కోట్లు ఖర్చు చేసినట్లు కేంద్రమంత్రి మురళీధరన్ రాజ్యసభలో వెల్లడించారు. సంవత్సరాల వారీగా ఖర్చు లెక్కను చూస్తే.. 2016-17లో రూ.76.27 కోట్లు.. 2017-18లో రూ.99.32 కోట్లు.. 2018-19లో రూ.79.91 కోట్లు ఖర్చు అయినట్లుగా బ్రేకప్ చెప్పారు.

చార్టర్ విమానాల ఖర్చే ఇంత ఉంటే.. మోడీ వెంట వెళ్లే పరివారం.. ఫారిన్ టూర్ల సందర్భంగా ఇచ్చే కానుకలు.. వగైరా.. వగైరాలను కలిపితే ఖర్చు పద్దు లెక్క భారీగా ఉంటుందనే చెప్పాలి.