Begin typing your search above and press return to search.
మోడీ ఫారిన్ టూర్లకు ఎంత ఖర్చు అయ్యిదంటే?
By: Tupaki Desk | 23 Sep 2020 7:30 AM GMTప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నరేంద్ర మోడీ అదే పనిగా విదేశీ పర్యటనలు చేయటం తెలిసిందే. తనకు ముందు ప్రధాని పోస్టులో ఉన్న వారెవరూ వెళ్లని దేశాలకు సైతం ఆయన వెళ్లేవారు. మోడీ పుణ్యమా అని.. భారత ప్రధాని మొదటిసారిగా పర్యటించిన దేశాలెన్నో. అంతేకాదు.. దశాబ్దం క్రితం.. రెండు దశాబ్దాల క్రితం ఆయా దేశాలకు వెళ్లారన్న రికార్డుల్ని కూడా మోడీ తుడిచేశారు. ప్రధానిగా మోడీ ఫారిన్ టూర్ల రికార్డుల్ని సవరించటం రానున్న రోజుల్లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టే వారికి కష్టసాధ్యమన్న మాట వినిపిస్తూ ఉంటుంది.
ఇదిలా ఉంటే.. తాజాగా మోడీ విదేశీ ప్రయాణాల ఖర్చు లెక్కలు బయటకు వచ్చాయి. పార్లమెంటు సమావేశాల్లో భాగంగా ఎంపీ ఒకరు వేసిన ప్రశ్నకు ప్రభుత్వం అధికారికంగా వివరాల్ని వెల్లడించింది. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నరేంద్ర మోడీ 2015 నుంచి ఇప్పటివరకు మొత్తం 58 దేశాల్లో పర్యటించినట్లుగా వెల్లడించారు. కేంద్రమంత్రి మురళీధరన్ ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానంలో ఆయన పలు అంశాల్ని పేర్కొన్నారు.
మొత్తం 58 విదేశీ పర్యటనల కోసం రూ.517.82 కోట్లు ఖర్చు అయినట్లుగా తేల్చారు. ప్రధాని హోదాలో మోడీ అమెరికా.. రష్యా.. చైనా దేశాల్లో ఐదుసార్లు చొప్పున పర్యటించారన్నారు. అదే సమయంలో సింగపూర్.. జర్మనీ.. ఫ్రాన్స్.. శ్రీలంక.. యూఏఈ లాంటి దేశాలకు పలుమార్లు వెళ్లినట్లుగా వెల్లడించారు. ద్వైపాక్షిక చర్చల్లో భాగంగానే మోడీ టూర్లు నడిచాయన్నారు.
విదేశీ టూర్లకు చివరిసారిగా మోడీ గత నవంబరు 13, 14 తేదీల్లో బ్రెజిల్ లో పర్యటించారు. తర్వాతి కాలంలో కరోనా పుణ్యమా అని ఆయన విదేశీ బ్యాంకులకు వెళ్లింది లేదు. తన విదేశీ పర్యటనల తర్వాత ఆయా దేశాలతో ద్వైపాక్షిక సంబందాలు మరింత బలపడ్డాయని.. పెట్టుబడులు.. వాణిజ్యం.. సాంకేతికత.. రక్షణ రంగాల్లో సహకారం కూడా పెరిగినట్లుగా మంత్రి చెప్పారు. మొత్తంగా తాను ఖర్చు చేసిన ప్రతి రూపాయికి తగ్గ ఫలితాల్ని దేశం పొందేలా మోడీ తీరు ఉందన్న మాట మంత్రి మాటల్లో వినిపించింది.