Begin typing your search above and press return to search.
కేసీఆర్ బాటలో మోడీ.. పార్లమెంట్ ను కూల్చేస్తాడట
By: Tupaki Desk | 29 July 2020 9:50 AM GMTఇప్పుడంతా కూల్చివేతల కాలం.. అంగరంగ వైభవంగా.. సకల సౌకర్యాలతో ఎంజాయ్ చేసేందుకు కొత్త కొత్త భవంతులు కట్టుకునే కాలం.. ఇక్కడ కేసీఆర్ మొదలెట్టాడు.. అక్కడ మోడీ అందుకున్నాడు. కేసీఆర్ సచివాలయాన్ని కూల్చివేస్తుంటే.. దాన్ని ఇన్ స్పిరేషన్ గా తీసుకున్నాడో ఏమోకానీ ప్రధాని మోడీ కూడా పార్లమెంట్ ను కూల్చడానికి రెడీ అయ్యాడు. తద్వారా తన పేరును భావి రాజకీయ నేతలంతా స్మరించుకునేలా కొత్త భవనాన్ని కట్టాలని డిసైడ్ అయ్యాడు.
చరిత్ర తెలుసుకోవాలంటే మనం కట్టే భవనాలు.. శిలా శాసనాలు మాత్రమే భావి వారసులకు అందుతాయి. ఎప్పుడో కట్టిన చార్మినార్ ఇప్పుడు హైదరాబాద్ ఐకాన్ అయ్యింది. అందుకే కేసీఆర్ వాస్తు సరిగా లేని సచివాలయాన్ని కూల్చి కొత్తది కట్టుకుంటున్నారు.
ఇప్పుడు ప్రధాని మోడీ సైతం అదేబాటలో నడుస్తున్నారు. ప్రస్తుత పార్లమెంట్ భవనం పురాతనమైందని.. దాన్ని కూల్చేస్తామని కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం మంగళవారం సుప్రీంకోర్టులో ఓ ఆఫిడవిట్ ను దాఖలు చేసింది.
ప్రస్తుత పార్లమెంట్ భవనం వంద ఏళ్ల పురాతన భవనమని.. భద్రతాపరంగా చాలా ఇబ్బందులు తలెత్తుతున్నాయని కేంద్రం పేర్కొంది. అంతేకాకుండా అగ్నిప్రమాదాలు సంభవిస్తే కష్టమేనని అఫిడవిట్ లో తెలిపింది. దీన్ని కూల్చేసి ఇదే స్థలంలో నూతన పార్లమెంట్ భవనాన్ని నిర్మిస్తామని కేంద్రం ప్రకటించింది.
*వందేళ్ల ఈ పార్లమెంట్ భవనం 1921లో నిర్మాణం మొదలుపెట్టారు. 1937లో ముగిసింది. ప్రస్తుత అవసరాలకు.. సాంకేతికతకు ఈ భవనం సరిపోదని కేంద్రం తెలిపింది.