Begin typing your search above and press return to search.
మన్మోహన్.. చిదంబరంలకు మోడీ పంచ్ లు
By: Tupaki Desk | 23 Dec 2016 4:55 AM GMTనిజాయితీ ఉన్న అసమర్థుడి కన్నా.. తప్పులు చేసే సమర్థుడితో ప్రజలకు ఎంతోకొంత ప్రయోజనం అని చెబుతుంటారు. సుద్దపూసలాంటి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పదేళ్ల పాలనలో దేశానికి ఏమీ జరగలేదన్న విషయాన్ని సూటిగా.. స్పష్టంగా.. ప్రజల మనసుల్లో రిజిష్టర్ అయ్యేలా మాట్లాడి తన కసి మొత్తాన్ని తీర్చుకున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. ఆర్థిక వేత్తగా.. మేధావిగా కీర్తించే మన్మోహన్ హయాంలో దేశానికి ఒరిగిందేమీ లేదన్న విషయాన్ని మోడీ తన మాటలతో తాజాగా స్పష్టం చేశారు.
పెద్దనోట్ల రద్దుపైనా.. నగదు రహిత లావాదేవీలపైనా మాజీ ప్రధాని మన్మోహన్.. మాజీ ఆర్థికమంత్రి చిదంబరం చేస్తున్న విమర్శలకు ఏకకాలంలో హోల్ సేల్ గా విమర్శనాస్త్రాల్ని సంధించారు ప్రధాని మోడీ. తన దగ్గరున్న సమాచారాన్ని కానీ బయట పెడితే భూకంపమే అంటూ నోరు పారేసుకొని..నవ్వుల పాలైన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో సహా.. మన్మోహన్.. చిదంబరంపై మోడీ ఓరేంజ్లో విరుచుకుపడ్డారు.
వారణాసి నియోజకవర్గంలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడిన మోడీ.. మాజీ ప్రధాని మన్మోహన్.. మాజీ ఆర్థికమంత్రి చిదంబరం మీద చేసిన విమర్శల్ని మోడీ మాటల్లోనే చెబితే..‘‘పెద్దనోట్ల రద్దు నిర్ణయం అనంతరం ఆరేసి గంటలు.. ఎనిమిదేసి గంటలు ప్రజలు ఓపికతో లైన్లలో నిల్చుంటున్నారు. ఇన్ని కష్టాలు పడ్డాక కూడా.. గుచ్చి గుచ్చి అడిగిన తర్వాత కూడా మంచి పనే చేశారు. దేశం కోసం ఎంత కష్టమైనా పడటానికి సిద్ధమేనని వారు చెబుతున్నారు. నన్ను వ్యతిరేకించే క్రమంలో మన నేతలు మాటల్లో బ్యాలెన్స్ కోల్పోతున్నారు. మన మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మంచి ఆర్థికవేత్త. ఆయన మన మాజీ ఆర్థికమంత్రి కూడా. చాలామందికి తెలియని విషయం ఏమిటంటే.. 1970 – 72 నుంచి ఆయన మనదేశ ఆర్థిక వ్యవస్థను నియంత్రించే కీలక ఆర్థికవేత్తల బృందంలో ఒకరు. ఇన్నేళ్లు ఆయన రాజకీయాల్లో ఉన్నా.. ఆయన మీద మరకపడలేదు. కానీ.. ఆయన చుట్టూ మాత్రం ఉంది. నేను నగదు రహితం గురించి మాట్లాడినప్పుడు ఆయన ఏమన్నారంటే.. 50 శాతం కంటే ఎక్కువ మంది పేదరింకంలో ఉన్న ఈ దేశంలో టెక్నాలజీ.. క్యాష్ లెస్ ఎలా సాధ్యం అని ప్రశ్నాంరు. నాకొకటి చెప్పండి భాయ్. ఆయన తన రిపోర్ట్ కార్డు గురించి చెబుతున్నారా? లేక.. నా రిపోర్ట్ కార్డు ఇస్తున్నారా? 50 శాతం పేదలు ఎవరి వారసత్వం..?’’
‘‘ఇంకో మహానుభావుడు ఉన్నాడు. ఆయనే.. శ్రీమాన్ చిదంబరం. ఆయన నిలదీస్తూ.. మన దేశంలో 50 శాతం గ్రామాల్లో ఇప్పటికి కరెంటు లేదని. ఇలాంటప్పుడు నగదు రహితం ఎలా చేస్తారని అడుగుతారు. నాకొకటి చెప్పండి.. ఊళ్లల్లో కరెంటు ఉంటే నేనేమైనా వచ్చి స్తంభాలు కూలగొట్టానా? తీగలు తెంపానా? అయ్యా చిదంబరంగారూ.. మేం బోలెడంత అభివృద్ధి చేశామని 2014లో చెప్పారు. ఇప్పుడమో 50 శాతం గ్రామాలు అంధకారంలో ఉన్నాయని అంటున్నారు. మోడీని వ్యతిరేకించే క్రమంలో వీరంతా నిజాలు చెబుతున్నారు’’ అంటూ మన్మోహన్.. చిదంబరంలు మరోసారి నోరు ఎత్తకుండా మోడీ నిప్పులు చెరిగారు. ఒక పార్టీ యాభైఏళ్లు పాలించిన తర్వాత కూడా.. ప్రజలకు కనీస అవసరాలైన విద్యుత్ అందించకపోవటం ఏంటి? ఇదెవరి వైఫల్యం..? దీనికి ఎవరు బాధ్యత వహించాలి?
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/