Begin typing your search above and press return to search.

మోడీ ఇలా ఓడిపోయారేంటి...?

By:  Tupaki Desk   |   18 April 2017 6:36 AM GMT
మోడీ ఇలా ఓడిపోయారేంటి...?
X
టైమ్స్ 100మంది ప్రభావశీల వ్యక్తుల జాబితా... ఏటా రిలీజయ్యే ఈ జాబితాలో మోడీ ఎప్పుడూ టాప్ పొజిషన్లలో ఉంటుంటారు. అయితే... ఆయన ఫస్ట్ ప్లేసులోకి రాలేకపోవడానికి ఇంతకాలం బరాక్ ఒబామా కారణం. దీంతో ఇప్పుడు ఒబామా పదవి నుంచి దిగిపోయాక మోడీయే టాప్ లో నిలుస్తారని అంతా అనుకున్నారు. కానీ... అనూహ్యంగా మోడీకి ఇంతకుముందున్న క్రేజ్ కూడా లేకుండా పోయింది. ఆయన స్థానం ఎక్కడికో పోయింది. ఎవరూ ఊహించని రీతిలో ఫిలిప్పీన్స్ అధ్యక్క్షుడు... కిల్లింగ్ స్క్వాడ్ లీడర్ డ్యుటెర్టో ఈ లిస్టులో టాప్ లో నిలిచారు.

‘టైమ్‌–100’ ప్రభావశీల వ్యక్తుల కోసం నిర్వహించిన రీడర్‌ పోల్‌ లో ప్రధాని మోదీకి ఒక్క ఓటూ పడలేదు. ప్రపంచవ్యాప్తంగా 100 మంది అత్యంత ప్రభావశీల వ్యక్తుల ఎంపిక కోసం ‘టైమ్‌’ మేగజైన్‌ నిర్వహించిన ఆన్‌ లైన్‌ రీడర్‌ పోల్‌ లో ఫిలిప్పీన్స్‌ వివాదాస్పద అధ్యక్షుడు రొడ్రిగో డ్యుటెర్టో అగ్రస్థానంలో నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచారు. 2016లో అత్యంత ప్రభావశీల వ్యక్తులను ఎంపిక చేసేందుకు టైమ్‌ మేగజైన్‌ రూపొందించిన ప్రముఖుల జాబితా (ప్రాబబుల్స్‌)లో మోదీతో సహా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ - ఆయన కుమార్తె ఇవాంకా - మైక్రోసాఫ్ట్‌ అధినేత బిల్‌ గేట్స్ - ఫేస్‌ బుక్‌ సీఈవో జుకర్‌ బర్గ్‌ తదితరులు చోటు దక్కించుకున్నారు.

దీనిపై ఆన్‌ లైన్‌ లో రీడర్‌ పోల్‌ నిర్వహించారు. ఇందులో అమెరికాకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన ఫిలిప్పీన్స్‌ అధ్యక్షుడు డ్యుటెర్టోకు అత్యధికంగా 5% ఓట్లు వేశారు. ఆ తర్వాత కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో - పోప్‌ ఫ్రాన్సిస్ - మైక్రోసాఫ్ట్‌ సహ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్ - ఫేస్‌ బుక్‌ సీఈవో మార్క్‌ జుకర్‌ బర్గ్‌ లకు 3% చొప్పున వచ్చాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కు 2% ఓట్లు పడ్డాయి. మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదేళ్ల - ట్రంప్‌ కుమార్తె ఇవాంకా - ఆమె భర్త కుష్నర్‌ లకు ఒక్క ఓటూ పడలేదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/