Begin typing your search above and press return to search.
చైనా బస్సుపై మోడీ మోజు
By: Tupaki Desk | 7 Aug 2016 11:22 AM GMT కార్లు మీదుగా ప్రయాణించే సరికొత్త మోడల్ బస్సును ఇటీవల చైనాలో ప్రారంభించారు. ఇప్పుడీ బస్సు ప్రపంచ దేశాలను ఆకర్షిస్తోంది. మన ప్రధాని మోడీకూడా దీనిపై మనసు పడినట్లుగా ఉంది. దాని సంగతేంతో కనుక్కోమని రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖను ఆయన ఆదేశించారు. ప్రపంచంలోనే తొలిసారి చైనా రూపొందించిన ట్రాన్సిట్ ఎలివేటేడ్ బస్ నిజంగా ఒక అద్భుతమే.
ట్రాన్సిట్ ఎలివేటేడ్ బస్ (టీఈబీ-1) పిలిచే ఈ భారీ బస్సును ఉత్తర చైనాలోని హ బెయి ప్రావిన్స్ లోని కిన్ హువాంగ్ డావో నగరంలో టెస్ట్ రన్ నిర్వహించారు. 25 అడుగుల వైశాల్యమున్న ఈ బస్సు రోడ్డు నుంచి దాదాపు రెండు మీటర్ల ఎత్తులో ఉంటుంది. దీంతో మిగతా వాహనాలు ఈ బస్సుకింద నుంచి ప్రయాణం చేయవచ్చు. అంటే బ్రిడ్జి కింద నుంచి వెళ్లినట్లుగా మిగతా వాహనాలు వెళ్లిపోతాయి. అవి వెళ్తాయనే కంటే ఈ బస్సే వాటిపైనుంచి వెళ్తుందని చెప్పాలి.
రోడ్డుకిరువైపులా నిర్మించిన ప్రత్యేక మార్గం ద్వారా ఈ బస్సు ప్రయాణిస్తుంది. ఒకేసారి నాలుగు బస్సు కోచ్ లను కలపడం ద్వారా దాదాపు 1400 మంది వరకు ప్రయాణం చేయవచ్చు. బస్సు లోపలి భాగం చాలా విశాలంగా ఉంది. రెండు వైపులా సీట్లు - మధ్యలో రౌండ్ సీట్లతో కంపార్టుమెంట్ చాలా స్టైలిష్ లుక్‌తో ఉంది. పైగా దీని తయారికి అయ్యే ఖర్చు కూడా తక్కువేనట. కరెంటుతో పనిచేసే ఇది రోడ్డుకు రెండువైపులా ఉండే ప్రత్యేక మార్గంపై నడుస్తుంది. మధ్యలో ఖాళీ ఉంటుంది. అంటే ఈ బస్సు ఒక బ్రిడ్జిలా ఉంటుందన్నమాట. గంటకు 60 కిమీ గరిష్ట వేగంతో నడిచే ఈ బస్సు మన దేశానికి బాగా ప్రయోజనకరమని భావిస్తున్నారు. ఎందుకంటే ఇది ట్రాఫిక్ కు ఏమాత్రం ఆటంకం కాకుండా కింద నుంచి మిగతా వాహనాలు వెళ్లేలా ఉంటుంది. అదే సమయంలో ఇందులో ఎక్కువమంది పడతారు కాబట్టి మిగతా వాహనాల రద్దీ కూడా తగ్గుతుంది. ఇప్పుడీ బస్సు మోడీ దృష్టిని ఆకర్షించడంతో దాని వివరాలు తెలుసుకోమని ఆదేశించారు.