Begin typing your search above and press return to search.
స్టాక్ మార్కెట్లకు మోడీ మీద నమ్మకం లేదా?
By: Tupaki Desk | 14 May 2019 6:10 AM GMTబీజేపీని ఒంటిచేత్తో 2014లో గద్దెనెక్కించిన మోడీ.. పేదలకు, రైతులకు చేసిన దానికంటే కార్పొరేట్లకే ఎక్కువ చేశాడన్న విమర్శ ఉంది. మోడీ హయాంలోనే జియో సహా దేశంలో డిజిటల్ విప్లవం వచ్చింది. ఎన్నో కంపెనీలు, కార్పొరేట్లు లాభపడ్డాయి. నోట్ల రద్దుతో పేటీఎం, లాంటి ఎన్నో కంపెనీలు ఆన్ లైన్ మనీ ట్రాన్స్ ఫర్ సిస్టంతో కోట్లకు పడగలెత్తాయి. జీఎస్టీతో ఎన్నో కంపెనీలకు లాభం జరిగింది. మోడీ ఐదేళ్ల పాలనలో రైతులకు, పేదలకు జరిగిన మేలు కంటే కార్పొరేట్లకు జరిగిన మేలే ఎక్కువ అన్నది పారిశ్రామికవర్గాల్లో వ్యక్తమవుతున్న మాట..
ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో గెలుపు ఎవరిదన్న ఉత్కంఠ దేశంలో రాజ్యమేలుతోంది. అయితే స్టాక్ మార్కెట్లు ఇప్పుడు దేశంలో వచ్చే ప్రభుత్వం ఎవరిదనే మీదే వాటి మనుగడ ఆధారపడి ఉంది. ఈసారి మార్కెట్ అనలిస్టులకు బీజేపీ నమ్మకం పోయినట్టు కనిపిస్తోంది. అందుకే ఈ నెలలో 2800 కోట్ల విలువైన అమ్మకాలు జరిపి పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు విదేశీ సంస్థాగత పెట్టుబడి దారులు.
తాజాగా కేంద్రంలో ఈసారి ప్రాంతీయ పార్టీలే కీలక పాత్ర పోషిస్తాయని ఎమ్ కే గ్లోబల్ అనే సంస్థ అంచనావేసింది. బీజేపీకి ఈసారి 170-180 సీట్లు మాత్రమే వస్తాయని రావచ్చని తెలిపింది. ఇక కాంగ్రెస్ కు 140-150 సీట్లు దక్కవచ్చు అని తెలిపింది. ప్రాంతీయ పార్టీల బలమే కొత్త ప్రధానమంత్రిని ఖరారు చేస్తుందని తెలిపింది.
అయితే తాజా అంచనాల ప్రకారం మే 23న మార్కెట్లు కుప్పకూలడం ఖాయంగా కనిపిస్తున్నాయి. మోడీ రాడన్న అంచనాలు విదేశీ ముదుపుదారులు పెట్టుబడులు వెనక్కి తీసుకోవచ్చు. అలాగే కార్పొరేట్ ఫ్రెండ్లీ బీజేపీ రాకపోవడంతో దేశీయ ఇన్వెస్టర్లు వెనక్కి తగ్గే అవకాశాలున్నాయి. బీజేపీ వెనుకబడితే మార్కెట్లు కుప్పకూలడం ఖాయమని.. అదే బీజేపీ మ్యాజిక్ ఫిగర్ కు దగ్గరకు వస్తే మార్కెట్ గుర్రంలా పరుగులు తీయడం కాయమని రిలీగేర్ సంస్థ అంచనావేస్తోంది.
గడిచిన నెల రోజుల్లో సెన్సెక్స్ స్టాక్ మార్కెట్లు పడిపోతున్నాయి. ఆల్ టైం గరిష్ట స్థాయి అయిన సెన్సెక్స్ 39,487 నుంచి 37090 పాయింట్లు నష్టపోయింది. నెలరోజుల్లోనే 2397 పాయింట్ల పతనమన్నమాట.. 2800 కోట్లను విదేశీ ముదుపుదారులు వెనక్కి తీసుకున్నారు. బీజేపీ ఓటమి బాట పడితే ఈ ట్రెండ్ మున్ముందు కూడా భారీగా పతనం అవుతుందని అంచనా.. బీజేపీ గెలుపునకు గడిచిన 2014 ఎన్నికల్లో దోహదపడిన యూపీ లో ఈసారి ఎస్సీ-బీఎస్పీ హవా ఉంది. దీంతో పాటు హిందీ బెల్ట్ లో వ్యతిరేకత ఉంది. దీంతోనే బీజేపీ గెలుపు ఈజీ కాదని అర్థమవుతోంది. స్టాక్ మార్కెట్లకు మోడీ మీద నమ్మకం లేదనడానికి నెలరోజులుగా పతనమవుతున్న స్టాక్ మార్కెట్ల పనితీరే నిదర్శనమని అనలిస్టులు చెబుతున్నారు.