Begin typing your search above and press return to search.
మోడీ ఎఫెక్ట్: గాంధీల కుటుంబం..దిగివస్తోంది..ఇవిగో సాక్ష్యాలు!!
By: Tupaki Desk | 19 Feb 2021 3:30 AM GMTకేంద్రంలోని నరేంద్ర మోడీ ఎఫెక్ట్ తమపైనా.. తమ పార్టీపైనా ఇంతగా ఉంటుందని కాంగ్రెస్ బహుశ ఊ హించి కూడా ఉండదు! 2014లో అధికారం కోల్పోయినప్పుడు.. ప్రజలు మార్పు కోరుకున్నారనే చిన్న కామెం ట్ చేసి.. తప్పుకొన్న కాంగ్రెస్‌కు 2019లో మరింత దెబ్బతగిలింది. ఇక, ఇప్పుడు వచ్చే 2024(జమిలి రాకుం టే) ఎన్నికల్లోనూ తమకు ఎడ్జ్ లేదని అర్ధమవుతోంది. ఇప్పుడు అదే మార్పును ప్రజలు కోరుకుంటు న్నార ని.. తమకు ఖచ్చితంగా అధికారం కట్టబెడతారని.. కాంగ్రెస్ మాట మాత్రంగా కూడా చెప్పలేక పోతోంది. దీనికి కారణం.. మోడీ ఎఫెక్ట్! తాను ఏం చేసినా.. ఈ దేశం కోసం.. ఈ ప్రజల కోసం.. అంటూ.. ఆయన చేస్తున్న ప్రసంగాలు ప్రజల్లోకి బాగా వెళ్తున్నాయి.
అంతేకాదు.. ప్రస్తుతం దేశంలో పెట్రో ధరలు పెరిగాయి. వంట గ్యాస్ వెలిగించకుండానే మండిపోతోంది. అయినప్పటికీ.. దీనికి కారణం.. కాంగ్రెస్సేనని మోడీ నమ్మబలుకుతుంటే.. కాంగ్రెస్ తిప్పికొట్టలేని పరిస్థితి ఎదుర్కొంటోంది. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఇదీ.. కాంగ్రెస్ ముందున్న ప్రధాన ప్రశ్న. ఈ నేపథ్యంలోనే తరాల తరబడి.. ఏర్పాటు చేసుకున్న అంతరాలను తగ్గించుకుంటూ.. ప్రజానాడిని వినేందుకు సిద్ధపడుతోంది. ప్రజాక్షేత్రంలోకి కాంగ్రెస్ దిగివస్తోంది. ఔను! ఇది నిజం. ఏడాది కిందటి వరకు కాంగ్రెస్ పరిస్థితి వేరు.. ఇప్పుడు వేరు. ప్రజలతో మమేకం కావడమే కాదు.. మేం కూడా.. మీ వంటివాళ్లమే! అని చెప్పేందుకు.. ప్రజలను ఒప్పించేందుకు సిద్ధమవుతోంది.
దీనికి ఇటీవల జరిగిన అనేక పరిణామాలు బలాన్నిస్తున్నాయి. ఒకప్పుడు ఎన్ని సభల్లో పాల్గొన్నా.. ఎంత ఆలస్యమైనా.. ఎంత మారు మూల ఉన్నా.. ఫైవ్ స్టార్ హోటల్ నుంచి భోజనం తెప్పించుకున్న రాహుల్ గాంధీ .. ఇప్పుడు రోడ్డుపై.. సామాన్యుడి తిండి తింటున్నారు. అందరితోనూ కలిసి.. సహపంక్తుల్లో పాల్గొంటున్నారు. నేను మీ వాణ్ని.. నాకు ప్రత్యేకంగా స్థాయి లేదు.. మీరిచ్చిందే అంతా! అని ఇటీవల ఆయన తమిళనాడులో స్వయంగా చెప్పుకొన్నారు. ఇక, ఇప్పుడు తాజాగా ఆయన మరిన్ని మెట్లు దిగారు. మరింతగా ప్రజలకు చేరువయ్యేందుకు ప్రయత్నించారు.
రాహుల్ గాంధీ పుదుచ్చేరిలో పర్యటనలో భాగంగా ఓ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులతో ముచ్చటించారు. ఈ సమయంలో రాహుల్‌ను విద్యార్థులు `సార్... సార్... సార్...` అంటూ సంబోధించారు. దీంతో రాహుల్.... ‘‘ఓ సారి వినండి. నా పేరు రాహుల్. సార్ కాదు. నన్ను రాహుల్ అని పిలవండి. లేదంటే రాహుల్ అన్నా అని పిలవండి. అది బాగుంటుంది. మీ ప్రిన్సిపాల్‌ను మాత్రం సార్ అని పిలవండి.’’ అని రాహుల్ అన్నారు. ఇదేదో.. ఊరికేనే.. మీడియా ముందు ప్రచారం కోసం చేసిన ప్రయోగం కాదు.. అక్షరాలా మోడీ ఎఫెక్ట్!! ఇప్పటి వరకు కాంగ్రెస్ నేతలు భావించిన తీరుకు.. ప్రజలకు వారు ఎంత దూరంగా ఉన్నారో తెలిసి రావడంతోనే రాహుల్ కొత్త పంథాను ఎంచుకున్నారనే విశ్లేషణలు వస్తుండడం గమనార్హం.