Begin typing your search above and press return to search.

మోడీ ఎఫెక్ట్.. ఊగిపోయిన నిర్మల

By:  Tupaki Desk   |   14 Feb 2021 10:32 AM GMT
మోడీ ఎఫెక్ట్.. ఊగిపోయిన నిర్మల
X
బడ్జెట్ పై వ్యతిరేకతను ఎలా చల్లార్చాలి? ఎలా ప్రతిపక్ష కాంగ్రెస్ పైకి నెట్టాలని బాగా ఆలోచించిన బీజేపీ పెద్దలు ఇప్పుడు తమ బడ్జెట్ ను పక్కనపెట్టి పాత కాంగ్రెస్ పాలన ఘోరాలను పైకి తెస్తున్నారు. ఆఖరుకు రాజకీయాల మాట మాట్లాడని నిర్మల చేత కూడా కాంగ్రెస్ ను తిట్టించడం విశేషం.

పార్లమెంట్ లో కేంద్రఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రెచ్చిపోయారు. తన సహజ శైలికి భిన్నంగా విరుచుకుపడ్డారు. కేంద్రఆర్థిక మంత్రి అయిన నిర్మల ఎప్పుడూ రాజకీయ విమర్శలకు అటు పార్లమెంట్ లో.. ఇటు బయట కూడా పెద్దగా స్పందించరు. ప్రెస్ మీట్లలోనూ విమర్శలపై వ్యాఖ్యానించారు. ఫక్తు ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలపైనే వ్యాఖ్యానిస్తారు. కానీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం సందర్భంగా నిర్మల రెచ్చిపోయారు.

మోడీ ఇదే పార్లమెంట్ సాక్షిగా కాంగ్రెస్ పార్టీని కడిగేస్తే తాజాగా ఆ బాధ్యతను నిర్మల తీసుకున్నారు. నిర్మలమ్మ రెచ్చిపోయారు. ఇన్ని దశాబ్ధాల భారతదేశ చరిత్రలో ఏనాడైనా పేదల గురించి.. మహిళల గురించి ఆలోచించారా? అని కాంగ్రెస్ పై దుమ్మెత్తి పోసింది నిర్మల.. తాము ఏం చేస్తున్నామో.. కాంగ్రెస్ ఏం చేయలేదో వివరించింది.

ఎప్పుడూ రాజకీయ విమర్శలపై స్పందించక బడ్జెట్ పై మాట్లాడే నిర్మిల ఇంతగా రెచ్చిపోవడం వెనుక వ్యూహం ఉందని బీజేపీ వర్గాలు అంటున్నాయి. బడ్జెట్ పై అందరి నుంచి పెదవి విరుపులు వస్తున్న వేళ ఆ ఇంపాక్ట్ బీజేపీపై పడకుండా కాంగ్రెస్ పైకి నెట్టివేయాలనే బీజేపీ పెద్దలు ఇలా చేస్తున్నారని తెలుస్తోంది. బడ్జెట్ పై వ్యతిరేకత దృష్ట్యా తప్పించుకునేందుకే ఇలా ప్లాన్ చేశారని భావిస్తున్నారు.