Begin typing your search above and press return to search.

మోడీ డబుల్ గేమ్ ?

By:  Tupaki Desk   |   29 Jun 2023 11:14 AM GMT
మోడీ డబుల్ గేమ్ ?
X
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కల్వకుంట్ల కవిత పీకల్లోతు కూరుకుపోయిందని బీజేపీ నేతలు పదేపదే ఆరోపించారు. నేడో రేపే అరెస్టు కూడా ఖాయమని ఒకటే ఊదరగొట్టారు. స్కామ్ లో సౌత్ గ్రూపు తరపున కవితే సూత్రదారని ఈడీ కూడా తేల్చింది. కోర్టులో దాఖలుచేసిన చార్జిషీట్లలో కవిత పేరును ఈడీ చాలాసార్లు ప్రస్తావించింది. స్కామ్ లో కవిత పాత్రేమిటో చాలా చోట్ల వివరించింది. మరి విచారణ ముగిసి ఇంతకాలమైనా కవితను ఈడీ ఎందుకు అరెస్టుచేయలేదు ?

తన కూతురు కవిత అరెస్టు తప్పదని కేసీయార్ కూడా మానసికంగా సిద్ధమైపోయారు. పార్టీ సమావేశంలో కేసీయార్ మాట్లాడుతు తన కూతురును ఈడీ అరెస్టు చేయబోతోందని ప్రకటించారు. కవిత అరెస్టు కాగానే సెంటిమెంటు ప్రయోగించి లబ్దిపొందేందుకు ప్రయత్నించారు కూడా.

సీన్ కట్ చేస్తే భోపాల్లో నరేంద్రమోడీ మాట్లాడుతు లిక్కర్ స్కామ్ లో కవిత పీకల్లోతు ఇరుక్కుపోయినట్లు ఆరోపించారు. అవినీతిపరులను ఎవరినీ వదిలే ప్రసక్తిలేదని హూంకరించారు.

మోడీ చెప్పిందే నిజమైతే మరి కవితను ఇన్నిరోజులు అయినా ఈడీ ఎందుకు అరెస్టుచేయలేదో చెప్పాలి. కవిత లిక్కర్ స్కామ్ లో ఇరుక్కుపోయిందని మోడీ కన్ఫర్ముడుగా చెప్పారంటే ఈడీ దగ్గర కచ్చితంగా ఆధారాలున్నట్లే కదా.

మరి స్కామ్ లో కీలకపాత్ర పోషించిన కవితను ఈడీ ఎందుకని అరెస్టుచేయటంలేదు ? ప్రజలకు మోడీ సమాధానం చెప్పాలి. స్కామ్ లో పాత్రదారులను అరెస్టుచేసిన ఈడీ మరి సూత్రదారుని మాత్రం ఎందుకు వదిలిపెట్టేసింది ?

కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నట్లు బీఆర్ఎస్, బీజేపీ మధ్య లోపాయికారీ ఒప్పందం ఏమైనా జరిగిందా ? అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. రెండుపార్టీల మధ్య ఎలాంటి అవగాహన లేకపోతే ఒప్పందం జరగకపోతే స్కామ్ లో కవిత అరెస్టు ఎందుకు జరగలేదు ? విచారణలో కవితను ఈడీ అరెస్టుచేసేయటం ఖాయమని తెలంగాణా బీజేపీ చీఫ్ బండి సంజయ్ తో పాటు కొంతమంది నేతలు చొక్కాలు చింపేసుకున్నారు. ప్రతిరోజు కవిత అరెస్టుగురించే గొంతు చించుకునేవారు. తెరవెనుక ఏమైందో ఏమో చివరకు బండి అండ్ కో బకరాలైపోయారు.