Begin typing your search above and press return to search.

మోడీ.. ఇంటి టాయిలెట్స్ చూసుకోరా?

By:  Tupaki Desk   |   31 Dec 2015 9:19 PM GMT
మోడీ.. ఇంటి టాయిలెట్స్ చూసుకోరా?
X
టీవీలు మొద‌లు సినిమాహాలుకు వెళ్లినా అనునిత్యం ఎర్ర‌కోట మీద భార‌త ప్ర‌ధాని మోడీ చేసే ప్ర‌సంగానికి సంబంధించిన ఒక ప్ర‌క‌ట‌న సంద‌డి చేస్తుంటుంది. దేశాన్ని క‌డిగిన ముత్యంలా మార్చాలంటూ స్వ‌చ్ఛ‌భార‌త్ కార్య‌క్ర‌మాన్ని ప్ర‌తిఒక్క‌రూ చేప‌ట్టాల‌ని కోర‌ట‌మే కాదు.. మ‌న దేశాన్ని మ‌నం ఎప్పుడు మార్చుకోవటం? అంటూ ఉద్వేగంగా ప్ర‌శ్నించే మోడీ క‌నిపిస్తారు.

దేశాన్ని స్వ‌చ్ఛంగా మార్చాల‌న్న త‌లంపు మోడీలో ఎంత భారీగా ఉందో చూశారా? అంటూ చంక‌లు గుద్దుకునే వారుంటారు. దేశం మొత్తాన్ని స్వ‌చ్ఛ‌భార‌త్ చేసేయాల‌న్న ఆలోచ‌న‌ను ఆవిష్క‌రించిన మోడీ.. దేశ‌రాజ‌ధాని ఢిల్లీలోని పండిట్ పంత్ మార్గ్ లోని బీజేపీ కార్యాల‌యంలోనే మ‌రుగుదొడ్లు కంపుకొడుతున్న వైనాన్ని చూపిస్తున్నారు. ఆ టాయిలెట్ల‌లోకి వెళ్ల‌టం ఎంత ఇబ్బందిగా ఉందంటూ స్వ‌యంగా ఆ పార్టీకి చెందిన మ‌హిళా నేత‌లు ప్ర‌శ్నించ‌టం గ‌మ‌నార్హం. తాము ఎదుర్కొంటున్న ఇబ్బందిని పార్టీ ముఖ్య‌నేత‌ల దృష్టికి తీసుకెళ్లినా పెద్ద‌గా ప‌ట్ట‌టం లేద‌ని వారు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.

మ‌రుగుదొడ్ల‌ను స‌రిగా శుభ్రం చేయ‌క‌పోవ‌టం వ‌ల్లే ఇలాంటి ఇబ్బంద‌ని చెబుతున్నారు. దేశం మొత్తాన్ని క‌డిగిన అద్దంగా త‌యారు చేయ‌ట‌మే త‌న లక్ష్యంగా చెబుతూ.. దేశ ప్ర‌జ‌ల నెత్తి మీద స్వ‌చ్ఛ‌భార‌త్ సుంకాన్ని వ‌సూలు చేస్తున్న మోడీ సాబ్‌.. త‌న ఇల్లు లాంటి ఢిల్లీ పార్టీ ఆఫీసు బాత్రూంల మీద ఎందుకు దృష్టి పెట్ట‌రు? దేశం మొత్తాన్ని స్వ‌చ్ఛంగా చేయాల‌ని భావిస్తున్న ఆయ‌న‌.. అంత‌కు ముందు.. సొంతింటి సంగ‌తి చూస్తే బాగుంటుంద‌న్న మాట వినిపిస్తోంది.