Begin typing your search above and press return to search.

తమిళనాడు నుంచి మోడీ పోటీ...టార్గెట్ అదే...?

By:  Tupaki Desk   |   8 July 2023 9:36 AM GMT
తమిళనాడు నుంచి మోడీ పోటీ...టార్గెట్ అదే...?
X
ప్రధాని నరేంద్ర మోడీ తమిళనాడు మీద గురి పెట్టారా. అక్కడ నుంచి ఆయన నరుక్కుని రావాలని చూస్తున్నారా అంటే జరుగుతున్న ప్రచారం మాత్రం అదే నిజం అంటోంది. ప్రధాని నరేంద్ర మోడీ ఈసారి సౌత్ వైపు ఫుల్ ఫోకస్ పెడుతున్నారని అంటున్నారు. దక్షిణాదిన మొత్తం నాలుగు రాష్ట్రాలలో కలుపుకుని 129 ఎంపీ సీట్లు ఉన్నాయి. ఈసారి ఇందులో సగానికి సగం అయినా కొల్లగొట్టాలని బీజేపీ పక్కాగా పధక రచన చేస్తోంది.

రెండు తెలుగు రాష్ట్రాల మీద ఈసరికే గురి పెట్టింది కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఓడినా అక్కడ జేడీఎస్ తో పొత్తు పెట్టుకుని పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయాలని చూస్తోంది. ఈ నేపధ్యంలో మోడీ చూపు తమిళనాడు మీద పడింది అని అంటున్నారు. ఎన్నికల నాటికి మూడేళ్ళు పూర్తయ్యే డీఎంకే పాలన మీద ఎంతో కొంత అసంతృప్తి ఉంటుందని దానిని క్యాష్ చేసుకోవడానికి బీజేపీ చూస్తోంది.

అక్కడ అన్నా డీఎంకే తో పొత్తు ఉంది. బీజేపీకి మాజీ పోలీస్ అధికారి అన్నామలైని అధ్యక్షుడిగా నియమించి దూకుడు రాజకీయాలను బీజేపీ చేస్తోంది. మరో వైపు చూస్తే వచ్చే ఎన్నికల నాటికి ఒక తమిళ హీరో పార్టీ పెడతారు అని వార్తలు వస్తున్నాయి. దాంతో ఆ పార్టీతో పొత్తు పెట్టుకుని రంగంలోకి దిగాలని కూడా బీజేపీకి ఆలోచనలు ఉన్నాయట.

ఈ నేపధ్యంలో నరేంద్ర మోడీ ఈసారి తమిళనాడులోని కన్యాకుమారి సీటు నుంచి పోటీ చేస్తారు అన్న ప్రచారం అయితే జోరుగా సాగుతోంది. ఇక్కడే బీజేపీ పోటీ ఎందుకు అంటే 2014లో కన్యాకుమారి నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్ధి రాధాక్రిష్ణన్ గెలిచారు. 2019లో కూడా ఆయన బీజేపీ తరఫున పోటీ చేస్తే 367,302 ఓట్లు వచ్చాయి. ఒక విధంగా ఇది బీజేపీకి కొంత అనుకూలమైన సీటు.

దాంతో మోడీ లాంటి బిగ్ ఫిగర్ దేశానికి ప్రధానిగా ఉన్న నేత పోటీకి దిగితే కచ్చితంగా గెలవడమే కాదు సమీప నియోజకవర్గాల మీద ప్రభావం పడుతుంది అన్న ఆలోచనలు కమలనాధుల్లో ఉన్నాయని అంటున్నారు.

అదే విధంగా ప్రధాని సౌతిండియా నుంచి ప్రాతినిధ్యం వహిస్తారు అన్న సందేశం కూడా వెళ్తుంది అని అది ఉత్తరాది పార్టీగా ఉన్న బీజేపీకి ఎనలేని మేలు చేస్తుంది అన్న మాస్టర్ ప్లాన్ తోనే మోడీ తమిళనాడు వైపు చూస్తున్నారు అని అంటున్నారు.

అధికేఅర డీఎంకే పట్ల వ్యతిరేకత ఉందని దాన్ని లోక్ సభ ఎన్నికల నాటికి క్యాష్ చేసుకోవచ్చు అన్న ఉద్దేశ్యంతొనే బీజేపీ ఉంది అంటున్నారు. ఇక ఇప్పటికే రాహుల్ గాంధీ కేరళ నుంచి పోటీ చేసి గెలిచారు. ఇలా అగ్ర నేతలు అంతా సౌతిండియా వైపు చూడడం అన్నది నిజంగా రాజకీయాల్లో మేలి మలుపు అని అంటున్నారు. మోడీ కన్యాకుమారి నుంచి పోటీ చేస్తే కనుక అది రాజకీయ సంచలనమే అవుతుంది అని అంటున్నారు.