Begin typing your search above and press return to search.
కేసీఆర్‌ది.. అవినీతి, కుటుంబ పాలన: మోడీ విమర్శల తూటాలు
By: Tupaki Desk | 8 July 2023 1:26 PM GMTతెలంగాణ పర్యటనలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వరంగల్ వేదికగా నిర్వహించిన విజయ సంకల్ప సభలో మాట్లాడుతూ.. కేసీఆర్ సర్కారుపై నిప్పులు చెరిగారు. తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్నది అవినీతి, కుటుంబ పాలన అని విమర్శలు గుప్పించారు. కేసీఆర్ ప్రభుత్వం అవినీతిని పెంచి పోషిస్తోందన్నారు. దేశంలోనే తెలంగాణ ప్రభుత్వం అత్యంత అవినీతి మయంగా మారిందని నిప్పులు చెరిగారు.
కేసీఆర్ సర్కారు అవినీతి ఢిల్లీ వరకూ పాకిందని ప్రధాని మోడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రం ఎన్నో అభివృద్ధి పనులు చేపడుతుంటే.. మరి రాష్ట్రం ఏం చేస్తోందని నిలదీశారు. అభివృద్ధి కోసం కొన్ని రాష్ట్రాలు కలిసి పని చేస్తుంటాయని, కానీ, తొలిసారి అవినీతి కోసం రెండు రాష్ట్రాలు కలిసి పని చేస్తున్నాయంటూ.. ఆయన వ్యాఖ్యానించారు. ఇలాంటి అవినీతి చూసేందుకేనా.. యువత ఆత్మ బలిదానాలు చేసిందని ప్రధాని వ్యాఖ్యానించారు.
మమ్మల్ని విమర్శిస్తే..
కేసీఆర్ ప్రభుత్వం కేవలం తమను విమర్శించడమే పనిగా పెట్టుకుందని ప్రధాన మంత్రి వ్యాఖ్యానించారు. కుటుంబ పాలనలో తెలంగాణ ప్రజలు చిక్కుకున్నారని.. కానీ వారు రాష్ట్ర సాధన కోసం చేసిన ఉద్యమంలో ఇలా జరుగుతుందని అనుకోలేదని మోదీ అన్నారు. కాంగ్రెస్ అవినీతి పాలనను దేశమంతా చూసిందని, కేసీఆర్ అవినీతి పాలనను చూస్తోందని అన్నారు.
కేసీఆర్ ప్రభుత్వం.. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసిందని మోడీ వ్యాఖ్యానించారు. యువతను మోసం చేసింది. లక్షలాది ఉద్యోగాలు కల్పిస్తామని హామీలు ఇచ్చి కేసీఆర్ మోసం చేశారని ప్రధాన మంత్రి చెప్పారు.
మోడీ ఇంకా ఏమన్నారంటే..
+ తెలంగాణలో టీఎస్‌పీఎస్‌సీ స్కామ్ ద్వారా కేసీఆర్ ప్రభుత్వం యువతను మోసం చేసింది.
+ యూనివర్సిటీల్లో 3 వేల అధ్యాపకుల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పోస్టులు భర్తీ చేయకుండా నిరుద్యోగులకు కేసీఆర్ సర్కారు ద్రోహం చేసింది.
+ కేసీఆర్‌పై సర్పంచ్‌లందరూ ఆగ్రహంతో ఉన్నారు.
+ గ్రామపంచాయతీలకు కేంద్రం ఇస్తున్న దిగమింగుతున్నారు.
+ ఆదివాసీ గ్రామాలకు ఎలాంటి మౌలిక సౌకర్యాలు కల్పించట్లేదు.