Begin typing your search above and press return to search.
మోడీ ప్రశ్న:పాక్ పార్లమెంటులో మననేతల్ని ఎందుకు పొగిడారు?
By: Tupaki Desk | 2 March 2019 6:06 AM GMTవిపక్ష నేతలపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విమర్శల పర్వం కొనసాగుతోంది. ఓవైపు దేశంలో ఉత్కంఠ పరిణామాలు నెలకొన్నప్పటికీ తన రాజకీయ పర్యటనలు ఆపని మోడీ ఈ సందర్భంగా ఆయా పార్టీ నేతలపై విరుచుకుపడుతున్నారు. విశాఖలో శుక్రవారం జరిగిన బీజేపీ ప్రజా చైతన్య సభ వేదికగా ప్రధాని మోడీ ప్రసంగిస్తూ - తమ ప్రభుత్వం ధైర్యంగా కీలక నిర్ణయాలు తీసుకుంటోందని - కేవలం పక్షపాతం - అవినీతి మకిలం అంటని తమకు ఎటువంటి భయాలు లేవన్నారు. ఇక్కడనున్న నాయకులు భయపడాలి - వారి అవినీతి - కుటుంబ పాలన - ఆశ్రీత పక్షపాతం వంటి చర్యలతో ఘోర తప్పిదాలకు పాల్పడిన నాయకులకే భయం పట్టుకుందంటూ టీడీపీ పాలన - ముఖ్యమంత్రి తీరుపై ధ్వజమెత్తారు. ఎన్ని సార్లు యూ టర్న్‌లు తీసుకున్నారు - ఎన్నిసార్లు మాటమార్చారో ప్రజలకు జవాబు చెప్పాలని పరోక్షంగా ఏపీ సీఎం చంద్రబాబు నిలదీశారు. యూటర్న్ లు తీసుకునే నాయకులు ఎవరితో జతకట్టారో ప్రజలకు తెలుసని బాబును ఎత్తిపొడిచారు.
ఈ సందర్భంగా విపక్షల ఐక్యతను మోడీ టార్గెట్ చేశారు. అవినీతిపరులంతా ఒక కూటమిగా ఏర్పడి - తమ ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ``ఈ కూటమి కట్టిన నాయకులకు ఒక అజెండా అంటూ ఏదీ లేదు, కేవలం మోడీ పదవి నుంచి దింపడమే లక్ష్యం. అవినీతితో నల్లధనం దాచుకున్న నేతలే ఈ కూటమిలో భాగంగా ఉన్నారు. భావసారూప్యత లేని కూటమి అధికారంలోకి వస్తే బలహీనమైన ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. దేశంలో బలహీనమైన ప్రభుత్వం ఉంటే దేశ ప్రగతిని కీలక నిర్ణయాలు తీసుకోగలరా?`` అంటూ ప్రశ్నించారు. ఇటీవల పుల్వామాలో ఉగ్రవాదుల ఘాతుకం - అనంతరం పాక్ ఉగ్ర ప్రేరేపిత కార్యకలాపాలపై వైమానిక దాడులు తదితర అంశాల్లో కూటమి ఆరోపణలు దేశాన్ని కంటికి రెప్పలా కాపాడే సైనికుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసిందన్నారు. ప్రపంచ దేశాలన్నీ పాకిస్తాన్ వైఖరిని వేలెత్తి చూపుతుంటే భారత్ లో అవినీతిలో మునిగిపోయిన కూటమి పార్టీలు మాత్రం పాక్ కు స్థైర్యాన్నిచ్చేలా ఉన్నాయన్నారు. భారత సైనికుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా చేసిన వ్యాఖ్యలను పాకిస్తాన్ పార్లమెంట్ లో ప్రస్తావనకు వచ్చాయంటే వారి లక్ష్యం ఏమిటని ప్రశ్నించారు. కూటమి తీరు భారత్‌ను బలహీన పరచడంతో పాటు పాకిస్తాన్ నైతికతను పెంచేలా ఉందంటూ ధ్వజమెత్తారు. దేశంలో బలమైన ప్రభుత్వం ఉంటే అన్ని వర్గాలు సుఖ సంతోషాలతో ఉంటాయన్నారు. దేశ భద్రత విషయంలో తమ ప్రభుత్వం ఎప్పటికీ వెనుకడుగు వేసేదే లేదన్నారు.
దేశాభివృద్ధిలో హరిత విప్లవం - పారిశ్రామిక విప్లవం అనంతరం తమ ప్రభుత్వం నీలి విప్లవానికి నాందీ పలికిందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. సుమారు 7,500 కిలోమీటర్ల మేర తీరప్రాంతం కలిగిన భారత్ లో మత్స్య సంపదతో బంగారం పండిచేలా చర్యలు తీసుకుంటోందన్నారు. మత్స్యకారుల సంక్షేమంతో పాటు వారికి ఆర్థికంగా ఉన్నత స్థితి కల్పించేందుకు నీలి విప్లవం దోహదపడుతుందన్నారు. తీరంలో విస్తృతంగా చిన్న - మధ్య తరహా హార్బర్ల నిర్మాణంతో మత్స్యకారులకు ఉపాధి అవకాశాలు పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. డీప్ సీ ఫిషింగ్ ను ప్రోత్సహించేందుకు మత్స్యకారులకు ఆర్థిక ఆసరా కల్పించేలా ట్రాలర్ల కొనుగోలుకు రుణాలు - వాటి మరమ్మతులకు ఆర్థిక సాయం అందించనున్నట్టు ప్రకటించారు. సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారులకు మత్స్య సంపదపై సమాచారం - ఇతర ప్రకృతి వైపరీత్యాల సందర్భంలో ఇస్రో సహకారంతో సాంకేతిక అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. దీనికోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ ద్వారా సాలీనా రూ.7,500 కోట్లతో నిధి ఏర్పాటు చేశామన్నారు. చేపల వేటను వ్యవసాయంగా గుర్తించి వారికి కూడా కిసాన్ క్రెడిట్ కార్డులు జారీ చేస్తామన్నారు. దేశంలోనే ప్రప్రధమంగా కిసాన్ సమ్మాన్ యోజన కింద 12 కోట్ల మంది రైతులకు సాలీనా రూ.6000 ఇస్తున్నామన్నారు. తొలి విడతగా రూ.2000 రైతుల ఖాతాలకు జమవుతాయన్నారు. రాష్ట్రంలో కూడా 78 లక్షల మంది రైతులు కిసాన్ సమ్మాన్ యోజనలో లబ్ధి పొందనున్నారన్నారు. మధ్య తరగతి సొంతింటి కలను నిజం చేసేందుకు వీలుగా నిర్మాణంలో ఉన్న ఇళ్లపై జీఎస్టీని 12 నుంచి 5 శాతానికి - మరో తరహా ఇళ్లకు 8 నుంచి 1 శాతానికి తగ్గించామన్నారు.