Begin typing your search above and press return to search.

బాబుకు పూర్తి రివ‌ర్స్ మాట‌ చెప్పిన మోడీ

By:  Tupaki Desk   |   5 Oct 2016 4:26 PM GMT
బాబుకు పూర్తి రివ‌ర్స్ మాట‌ చెప్పిన మోడీ
X
ఇండియ‌న్ ఆర్మీ పాకిస్థాన్‌ లోని ఉగ్ర‌స్థావ‌రాల‌పై చేసిన దాడి...ఈ ఎపిసోడ్‌ పై దేశం మొత్తం ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీని బీజేపీని ప్ర‌శంసిస్తోంది. అయితే సంద‌ట్లో స‌డేమియాలాగా ఆ పార్టీ నేత‌లు - ప్ర‌భుత్వంలోని భాగ‌స్వామ్యులు దీన్ని హైప్ చేసుకుంటున్నారు. ఎందుకంటే చిన్న‌విజ‌య‌మైన రాజ‌కీయాల్లో ముఖ్యం కాబ‌ట్టి. అయితే . ఇవాళ జ‌రిగిన కేబినెట్ క‌మిటీ ఆన్ సెక్యూరిటీ స‌మావేశంలో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ దీన్ని త‌ప్పుప‌ట్టారు. ఉగ్ర స్థావ‌రాల‌పై చేసిన దాడుల గురించి అతిగా మాట్లాడ‌టం - గొప్ప‌లు చెప్పుకోవ‌డం చేయొద్ద‌ని మంత్రుల‌ను హెచ్చ‌రించారు. కేవ‌లం అనుమ‌తి ఉన్న వ్య‌క్తులే ఈ దాడుల‌పై స్పందించాల‌ని ఆయ‌న స్ప‌ష్టంచేశారు. యూరిలో ఉగ్ర‌దాడుల‌కు ప్ర‌తీకారంగా గ‌త‌వారం ఉగ్ర‌స్థావ‌రాల‌పై ఆర్మీ స‌ర్జికల్ దాడులను యూపీ - పంజాబ్ ఎన్నిక‌ల్లో గెలుపు కోసం బీజేపీ వాడుకుంటోంద‌న్న విమ‌ర్శ‌లు కూడా వ‌చ్చాయి. ఈ నేప‌థ్యంలోనే మోదీ మంత్రుల‌కు ఈ సూచ‌న చేసిన‌ట్లు తెలుస్తోంది.

కాక‌తీళ‌యంగా మ‌రో సంద‌ర్భంగా ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు త‌న మంత్రివ‌ర్గ స‌హ‌చ‌రుకుల‌కు దీనికి పూర‌త్ఇ విరుద్ధ‌హైన సూచ‌న చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని కేఎల్‌ వర్శిటీలో మూడ్రోజుల పాటు నిర్వహిస్తున్న తెలుగుదేశం పార్టీ శిక్షణాతరగతుల్ని ఆ పార్టీ జాతీయాధ్యక్షుని హోదాలో చంద్రబాబు ప్రారంభించారు. అనంతరం ఈ మూడ్రోజుల శిక్షణలో నాయకత్వ సాధికారతపై ప్ర‌సంగిస్తూ... "రాష్ట్రంలో ఎన్ని ఆర్ధిక ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నా జాతీయస్థాయిలో అన్ని రాష్ట్రాలకు మించి అభివృద్ధి సాధించాం.. కేంద్ర సగటుకంటే దాదాపు రెండురెట్లు అధికంగా ఉత్ప‌త్తిలో వృద్ధి నమోదు చేశాం..విద్య - ఆరోగ్యాల నుంచి అన్ని రంగాలకు విశేష ప్రాధాన్యతనిస్తున్నాం.. జలవనరులకు పెద్ద పీటేశాం..అంతమాత్రాన సరిపోదు.. ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి కల్పించడమేకాదు.. దీనిపై క్షేత్రస్థాయిలో సమర్ధవంతంగా ప్రచారం చేయాలి.. ఇప్పట్నుంచే శ్రేణుల్ని వచ్చే ఎన్నికలకు సమాయత్తం చేయాలి "అంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. చూస్తుంటే ప్ర‌ధాన‌మంత్రి ప్ర‌సంగానికి పూర్తి విరుద్ధంగా బాబు స్పీచ్ సాగింద‌నే అభిప్రాయాన్ని ప‌లువురు వ్య‌క్త‌ప‌రుస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/