Begin typing your search above and press return to search.
ఉగాది స్పెషల్ : ముగ్గురు మొనగాళ్లకు మంచి రోజులే !
By: Tupaki Desk | 8 April 2016 7:15 AM GMTఉగాది అంటే కొత్త సంవత్సర వేడుకే కాదు... ఆ ఏడాది పొడవునా భవిష్యత్తు ఎలా ఉండబోతుందన్నది తెలుసుకుంటారు కూడా. ఎవరికి వారు తెలుసుకోవడంతో పాటు తమ ప్రాంతం - తమ ఆరాధ్య నేతల భవిష్యత్తు ఎలా ఉంటుందో కూడా తెలుసుకోవాలని అనుకుంటారు. దుర్ముఖి నామ సంవత్సరంలో దేశాధినేత నరేంద్ర మోడీ.... తెలుగు రాష్ర్టాల సారథులు ఇద్దరు చంద్రుళ్లకు ఎలా ఉండబోతుందన్నది ఆసక్తికరమే. రాజకీయంగా - పాలనాపరంగా ఎలా ఉంటుందన్నది చూద్దాం...
మోడీ... మరింత విజయమే..
మోడీని ఒకే కొమ్మకు పూసిన రెండు రంగుల పువ్వుగా చెప్పొచ్చు. విజయగర్వాన్ని - పరాజయ భారాన్నీ ఒకేలా తనలో నింపుకొనే నేత. ఇతరులు ఏమనుకుంటారో అన్న అనవసరపు ఆలోచన లేకుండా తాను నమ్మింది ఆచరించే నాయకుడు. నిత్య నూతనత్వాన్ని - అభివృద్ధిని అందుకోవాలని బలంగా ఆకాంక్షిస్తుంటారు. ఎక్కడ పనికొచ్చే విషయం ఉన్నా దాన్ని స్వీకరిస్తారు. ప్రతి అంశంపైనా తనదే ముద్ర ఉండాలనుకుంటారు. అదేసమయంలో మోడీలో కొంత అభద్రతా ఉంది... అందుకే ఆయనలో అనుమానం కనిపిస్తుంటుంది. భావోద్వేగాలకు ప్రాధాన్యమిస్తారు. అనుకున్న పని పూర్తిచేయడానికి సర్వశక్తులు ధారబోస్తారు. ఇతరులు కూడా తనలాగే పనికి అంకితం అయిపోవాలని అనుకుంటారు.. దాంతో చుట్టూ ఉన్నవారు కొంత ఇబ్బంది పడతారు. సూటిగా ఆలోచించే మనిషైన మోడీని పూర్తిగా అర్థం చేసుకున్నవారు ఆయన స్నేహాన్ని వీడరు. అయితే... అంతా నా ఇష్టం అనే మోనార్కిజం కూడా మోడీలో కనిపిస్తుంటుంది.
మోడీపై గ్రహాల ప్రభావం ఇలా...
సూర్యుడు: ఆదినారాయణుడి ప్రభావం వల్ల ఆయన విశేషంగా పేరు ప్రతిష్ఠలు పొందుతారు. గతం లో ఆయన్ని, ఆయన నాయకత్వాన్ని చిన్నచూపు చూసినవారు అభిమానించడం ప్రారంభిస్తారు. సూర్యుడు రాజకీయంగా ఆయన్ని బలోపేతం చేస్తాడు. గత ఏడాది ఎదుర్కొన్న పరాజయభారం తొలగేలా ఈ ఏడాది మంచి విజయాలు అందిస్తాడు. మోడీ శక్తియుక్తుల్లో ఏమాత్రం తగ్గుదల ఉండదు.. ఆయన ఆలోచనలకు ఫలితాలు కనిపిస్తాయి.
చంద్రుడు: చంద్రుడు - కుజ గ్రహాల కలయిక ఫలితంగా ఈ ఏడాది మోడీ కలలన్నీ నెరవేరు తాయి. అడుగుపెట్టిన ప్రతిరంగంలోనూ సక్సెస్ సాధిస్తారు. కొత్త ఆలోచనల రూపకల్పనకు సరిపడ అనిర్వచనీయమైన శక్తిని కుజుడు ఆయనకు ప్రసాదిస్తాడు. నీచంలో ఉన్న చంద్రుడు కుజుడి మద్దతుతో శక్తిమంతమవుతాడు. బద్ధ శత్రువులపై విజయాన్ని సాధించడంలో సహకరిస్తాడు.
కుజుడు: మోడీపై ఉన్న అనుమానాలు తొలగేలా తోడ్పడతాడు. ఈ ఏడాది చివరినాటికి అంతర్జాతీయ మార్కెట్ పై మోడీ మార్కు పడేలా చేస్తాడు.
శుక్రుడు: శుక్రుడు సింహరాశిలో ఉండడం కొంత ప్రతికూలమే. ఆయనపై వ్యక్తిగత విమర్శలకు కారణమవుతాడు.
శని: ఆలోచనలకు రూపకల్పన ప్రయత్నంలో సంతృప్తిని చేకూరుస్తాడు. లెక్కలేనంతమంది అభిమానులను పొందడంలో సహకరిస్తాడు. అవసరమైన వాటికి స్పందించకుండా ఉండటం వల్ల కొంత ఇబ్బంది తలెత్తుతుంది.
--------------
బాబుకు కష్టాలు తీరుతాయి..
అవిశ్రాంతంగా పనిచేయడం ఈ రాశి లక్షణం. వినూత్నమైన ఆలోచనల నిధిగా ఉంటారు. సవాళ్లు స్వీకరించడంలో ముందుంటారు. ప్రపంచమంతా విమర్శిస్తున్నా తాను అనుకున్నది సాధించి తిట్టిన నోళ్లే పొగిడేలా చేసుకునేలా పనిచేస్తారు. అయితే, విరామమెరుగు పరిశ్రమమించే ఆయన తన వెంట ఉన్నవారూ అలాగే ఉండాలని అనుకోవడం... వారు ఆయన స్థాయిని అందుకోలేకపోవడం వల్ల వారు కొంత విసుక్కునే ప్రమాదం ఉంది. దీర్ఘ కాలిక లక్ష్యాలను ఏర్పరుచుకోవడం వల్ల వాటిని అర్థం చేసుకున్నవారు తప్ప మిగతావారు కొంత వ్యతిరేకించే ప్రమాదముంది.
తక్షణ ప్రయోజనాలు దక్కని వారు చంద్రబాబును వ్యతిరేకిస్తారు. అయితే.. ఇప్పటికే మొదలుపెట్టిన ప్రణాళికలు ఫలితమివ్వడం... ఆయన కార్యాచరణ ఈ ఏడాది భౌతికంగా కనిపించడం ప్రారంభమవుతుంది. దీంతో ఆయన పట్ల ఆదరణ పెరుగుతుంది.
అనుకూలతలు... ప్రతికూలతలు....
- తనకు తెలిసింది - చేపట్టినది సరైందని ఆయన నమ్ముతుంటారు. ఈ వైఖరి కారణంగా ఆయనకు అనుచరులుగా ఉన్నవారు మనస్ఫూర్తిగా విధేయులుగా ఉండలేరు. మాటల కన్నా కార్యాచరణకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా ప్రజల్లో సానుకూల ప్రభావాన్ని సృష్టించడానికి ప్రయత్నించాలి. అది దీర్ఘకాలంలో ప్రజలకు మరింత దగ్గర చేసేందుకు అది దోహదపడుతుంది.
- ఆయనకంటూ చాలా కచ్చితమైన అభిప్రాయాలు ఉంటాయి. దేని కోసం తన చిత్తాన్ని మార్చుకోరు. కానీ నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆయన అభిప్రాయాలు సరైనవి కావని తేలితే ఆత్మ రక్షణలో పడతారు. ఒకే రకమైన ఆలోచనలకు అంకితమైపోవడం వల్ల ఆయన ఊహాలోకంలో, కలల్లో మునిగి తేలుతుంటారు. తన ఆలోచనలపై ఇతరుల అభిప్రాయాలను తెలుసుకోవడానికి బదులుగా వాటిని వారిపై రుద్దడానికి చూస్తారు.
- ప్రస్తుత రాజకీయ - సామాజిక పరిస్థితులు ఆయనకు పూర్తి అనుకూలంగా ఉన్నాయి. కానీ ప్రజలను చేరుకోవడంలో పటిష్టమైన దృక్కోణాన్ని వినియోగించుకోవడానికి బదులుగా ఇతరుల తప్పులను వాడుకుంటున్నారు. తాను చేసిన మంచి పనులు - సమర్థమంతమైన నాయకత్వం గురించి చెప్పడానికి బదులుగా ఇతర రాజకీయ నేతలను లక్ష్యంగా చేసుకుంటున్నారు.
- అవకాశాలు - వనరులను అందిపుచ్చుకోవడం ఆయన బలం. ప్రస్తుత వాతావరణంలో వనరులపై ఆధారపడ్డానికి బదులుగా వాటిని సృష్టించాలి.
- చంద్రబాబు జాతక చక్రంలో గురుడు - శుక్రుడు అత్యంత అనుకూలంగా ఉన్నారు. అనుకున్న దాని కన్నా మిన్నగా రాజకీయాల్లో ప్రగతి సాధిస్తారు. రానున్న రోజుల్లో గట్టి పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది.. అయినా, దాన్ని సమర్థంగా ఎదుర్కొని విజయం సాధిస్తారు.
----------
కేసీఆర్... పట్టిందల్లా బంగారమే..
చంద్రుడు: కేసీఆర్ ఆకాంక్షలు చూడ్డానికి వ్యక్తిగతమైనవిగా కనిపించినా వాటి ప్రయోజనాలు చేకూరడానికి సమయం పడుతుంది. ఆయన రాశిచక్రంలో చంద్రుని స్థితి వల్ల చుట్టూ ఉన్నవారికి మేలు జరుగుతుంది.
సూర్యుడు: ఇతరులతో పనిచేయించడంలో నేర్పరులవుతారు. ప్రజా కోణంలో పనిచేస్తారు. కొంత అధికార దర్పం - అహంకార ధోరణి వల్ల వ్యక్తులు కొందరు దూరమయ్యే సూచనలున్నాయి.
గురుడు: వృషభ రాశిలో ఉన్న గురుడు ఆరోగ్యం గురించి ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటాడు. వృత్తిలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తారు. అందరినీ దారికి తెచ్చుకునేందుకు ఎత్తుగడలు వేస్తారు. అన్ని వర్గాలను అక్కున చేర్చుకుంటారు.
కుజుడు: అధికార భద్రతకు ఢోకా ఏమాత్రం లేదు. పాపులారిటీ మరింత పెరుగుతుంది. ఈ ఏడాది శత్రువులు, ప్రత్యర్థులపై విజయం సాధిస్తారు. జనంలో కేసీఆర్ పట్ల అభిమానం ద్విగుణీకృతమవుతుంది.
బుధుడు: ఏం కోరుకున్నా సాధించే అవకాశం ఉంది. శత్రువులు తగ్గుతారు. నాయకుడిగా ముందుండి నడిపిస్తాడు. అదే నాయకుడిగా జనం మధ్య కలిసిపోతారు.
శుక్రుడు: దైవం పట్ల, ఆధ్యాత్మిక చింతన పట్ల తనకున్న చిత్తశుద్ధిని కేసీఆర్ త్వరలో కార్యాచరణతో ప్రదర్శిస్తారు. రాష్ట్ర దేవాదాయ అభివృద్ధి పట్ల ప్రత్యేక దృష్టి పెడతారు. పురాతన వ్యవస్థ ప్రక్షాళన ఆయన ప్రణాళికలో చోటు చేసుకుంటుంది. తన ఆలోచనలేమిటన్నది ఆయన బహిర్గతం చేయకపోవచ్చు. కానీ అంతిమంగా ఆయన పనితీరు ఒక నిదర్శనంగా మిగిలిపోతుంది.
శని: రాష్ట్రాభివృద్ధి కోసం కేసీఆర్ భూములు, వ్యవసాయాభివృద్ధి, నిర్మాణాలు, రసాయనిక పరిశ్రమలు - ఔషధ పరిశ్రమ లాంటి రంగాలపై ప్రధానంగా దృష్టి పెడతారు.
-- గరుడ