Begin typing your search above and press return to search.

బర్త్ డే బాయ్ మోడీ ఇంటికెళ్లి ఏం చేశారంటే..

By:  Tupaki Desk   |   17 Sept 2016 1:40 PM IST
బర్త్ డే బాయ్ మోడీ ఇంటికెళ్లి ఏం చేశారంటే..
X
నేడు ప్రధాని నరేంద్ర మోడీ 66వ జన్మదినోత్సవం. తమ అధినేత పుట్టినరోజును సేవా దిన్ గా నిర్వహించాలని బీజేపీ అధినాయకత్వం ఆర్డర్ జారీ చేస్తే.. కమలనాథులంతా ఆ వేడుకల్లో మునిగిపోయారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఈసారి తన పుట్టినరోజును సొంత రాష్ట్రంలో జరుపుకోవాలని మోడీ డిసైడ్ అయ్యారు. ఇందులో భాగంగా ఆయన శుక్రవారం రాత్రి అహ్మదాబాద్ చేరుకున్నారు. ఆయనకు బీజేపీ నేతలు.. ఆ రాష్ట్ర గవర్నర్ ఓపీ కోహ్లీ మొదలు గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీతో సహా పలువురు మంత్రులు.. నేతలు.. క్యాడర్ ఎయిర్ పోర్ట్ కు చేరుకొని స్వాగతం పలికారు.

గాంధీనగర్ లోని రాజ్ భవన్ లో బస చేసిన ఆయన.. ఉదయం తన తల్లి హీరాబెన్ ఆశీస్సులు తీసుకోవటం కోసం గాంధీ నగర్ బయలుదేరి వెళ్లారు.నిజానికి ప్రధాని కాక ముందు నుంచి తన పుట్టినరోజు సందర్భంగా తన తల్లి హీరాబెన్ వద్దకు వెళ్లటం.. ఆమె ఆశీర్వాదం తీసుకోవటం అలవాటే. గతంలో అయితే.. ఎలాంటి భద్రత లేకుండా ఒకే కారులో వెళ్లి వచ్చే వారు.

తాజాగా తన తల్లి వద్దకు వెళ్లిన మోడీ.. ఆమెను కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం ఆమె కొడుక్కి మిఠాయి తినిపించి ముచ్చటించారు. తన తల్లిని కలిసి.. ఆమె ఆశీస్సులు తీసుకొని ఆశీర్వాదం పొందారు. మరోవైపు మోడీ పుట్టినరోజు నేపథ్యంలో దేశ వ్యాప్తంగా కమలనాథులు భారీగా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. మరోవైపు మోడీకి రాష్ట్రపతి ప్రణబ్ తో సహా.. ప్రముఖులు పెద్ద ఎత్తున పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాలి. తన రాజకీయ ప్రత్యర్థులకు సైతం పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పే అలవాటు ఉన్న మోడీకి.. భారీ ఎత్తున బర్త్ డే విషెస్ రాకుండా ఉంటాయా?