Begin typing your search above and press return to search.
మోడీ..బాబుల గురువారం భేటీ రద్దు
By: Tupaki Desk | 19 Aug 2015 7:42 AM GMTఏపీకి ప్రత్యేకహోదా.. ప్యాకేజీకి సంబంధించి ప్రధాని మోడీని గట్టిగా నిలదీయాలని.. ఏపీ ప్రయోజనాల గురించి తమ వాదనను బలంగా వినిపించాలని చెప్పుకుంటున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆ అవకాశం లేని పరిస్థితి. గురువారం భేటీని రద్దు చేస్తూ ప్రధానమంత్రి కార్యాలయం నిర్ణయం తీసుకుంది.
వేరే పనుల కారణంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో జరగాల్సిన భేటీ క్యాన్సిల్ అయ్యిందని.. ఈ నెల 25.. 28.. 29.. 31 తేదీల్లో ఏదో ఒక తేదీని ఎంపిక చేసుకుంటే.. ప్రధానితో భేటీ ఏర్పాటు చేస్తామంటూ ప్రధాని కార్యాలయం పేర్కొంది.
బీహార్ కు రూ.1.65లక్షల కోట్లు (మంగళవారం ప్రకటించింది రూ.1.25 లక్షల కోట్లు.. గతంలో ఇచ్చిన రూ.40వేల కోట్లు హామీలు) ప్యాకేజీ ప్రకటించి.. బీహారీలు మనసుల్ని దోచుకునేందుకు ప్రధాని మోడీ ప్రయత్నించటం.. దీనిపై సీమాంధ్రులు ఉడికిపోతున్న పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లోనే ప్రధానితో.. ఏపీ ముఖ్యమంత్రి భేటీ కానున్న నేపథ్యంలో.. ఏదో ఒకటి జరుగుతుందన్న అంచనాలకు భిన్నంగా.. ప్రధానమంత్రి కార్యాలయం భేటీనే వాయిదా వేసింది.
తాజాగా ఇచ్చిన నాలుగు తేదీల్లో ఒకదాన్ని ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయం ఎంపిక చేసుకొని.. ప్రధాని కార్యాలయానికి తెలిపి.. ఫైనల్ చేసుకోవటం.. ఆ రోజు నాటికి ఎలాంటి ఆటంకాలు లేకుంటే తప్ప వెంటనే భేటీ అయ్యే అవకాశం లేనట్లుగా కనిపిస్తోంది. అపాయింట్ మెంట్ ఇవ్వను అనే కన్నా.. ఇచ్చి.. బిజీ కారణంగా రద్దు చేసుకుంటే ఎవరు ఏమీ అనలేరన్నట్లుగా మోడీ వైఖరి కనిపిస్తోంది. మరి.. దీనిపై ఏపీ అధికార.. విపక్షాలు ఎలా రియాక్ట్ అవుతాయో..?