Begin typing your search above and press return to search.
మోడీ ‘సన్యాసి’ మాటకు అదిరిపోయే పంచ్
By: Tupaki Desk | 4 Dec 2016 7:27 AM GMTమాటల్లో ప్రధాని మోడీని ఢీ కొట్టే వారు పెద్దగా కనిపించరు. తన రాజకీయ ప్రత్యర్థులకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా ఉండేలా మాట్లాడుతుంటారు. అయితే.. మోడీ మాటల్ని ఆయన మీదే ప్రయోగించాలన్న తపన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చాలా ఎక్కువ. ఈ క్రమంలో వెనుకా ముందు చూసుకోకుండా.. పలుసార్లు ట్వీట్లు చేసేసి అడ్డంగా బుక్ అయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. పోయిన చోటే వెతుక్కోవాలన్న సూత్రాన్ని కేజ్రీవాల్ బాగా నమ్ముతున్నట్లుగా కనిపిస్తుంటుంది.
మోడీ మీద తాను చేసే వ్యాఖ్యలు మిస్ ఫైర్ అయినా.. ఆయన్ను వదిలిపెట్టకుండా పంచ్ ల మీద పంచ్ లు వేసే వైనం కనిపిస్తూ ఉంటుంది. అలాంటి ప్రయత్నం తాజాగా కాస్త ఫలితాన్ని ఇచ్చిన ఘటన తాజాగా చోటు చేసుకుంది. యూపీలోని మొరాదాబాద్ లో జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన మోడీ.. తనను తాను ఒక ఫకీరుగా అభివర్ణించుకోవటం తెలిసిందే.
తన దగ్గరున్న సామానుని.. బ్యాగులో సర్దేసుకొని వెళ్లిపోగలనని చెబుతూ.. తనదెంత సింఫుల్ జీవితమో తన మాటలతో చెప్పే ప్రయత్నం చేసిన మోడీపై కేజ్రీవాల్ వేసిన పంచ్ పలువురిని ఆకర్షిస్తోంది. సన్యాసిగా చెప్పుకునే ప్రధాని మోడీ ఏకంగా రూ.10లక్షల విలువైన సూట్ ను ధరిస్తారంటూ పాత విషయాన్ని గుర్తు చేసేలా చురకలు వేశారు.
‘‘మోడీగారు.. మిమ్మల్ని మీరు ఒక సన్యాసిగా చెప్పుకుంటారు. రోజూ నాలుగు జతల కొత్త బట్టలు వేసుకుంటారు. రూ.10లక్షల సూటు తొడుక్కొని పర్యటిస్తుంటారు’’ అని మోడీలోని కోణాన్ని జనాలు కన్వీన్స్ అయ్యేలా చెప్పారు. ప్రధాని నోటి నుంచి వచ్చిన సన్యాసి మాటకు కేజ్రీవాల్ సూట్ కౌంటర్ అదిరిందనే చెప్పాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/