సికింద్రబాద్ ఎంపీ, కేంద్రహోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి పనితీరుకు మెచ్చి పదోన్నతి లభించింది. ఇప్పటికే కేంద్రహోంశాఖ సహాయ మంత్రిగా రాణించిన ఆయన సేవలను గుర్తించిన ప్రధాని మోడీ తాజాగా కిషన్ రెడ్డికి కేబినెట్ మంత్రి పదవి ఇచ్చారు.
హోంశాఖ సహాయ మంత్రిగా పనిచేస్తున్న సికింద్రాబాద్ ఎంపి కిషన్ రెడ్డికి ప్రధాని నరేంద్ర మోడీ కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో పదోన్నతి కల్పించారు. కిషన్ రెడ్డిని ఫుల్ టైం కేబినెట్ మంత్రిగా చేయనున్నారు. కిషన్ రెడ్డికి కొత్తగా మార్చిన సహకార శాఖ అప్పగించినట్టు తెలిసింది.
ప్రధాని మోడీ తన కొత్త క్యాబినెట్లో 43 మంది కొత్త మంత్రులను తీసుకుంటున్నారు. సీనియర్లకు మంగళం పాడి కొత్తవారిని, యువతకు ప్రాధాన్యం ఇవ్వబోతున్నట్టు తెలిసింది. పునర్వ్యవస్థీకరణలలో ఈసారి కిషన్ రెడ్డితోపాటు జ్యోతిరాదిత్య ఎం సింధియా, కిరెన్ రిజిజు, మీనాక్షి లేఖి మోడీ మంత్రివర్గంలో ప్రమోషన్ పొంది కేంద్రమంత్రులుగా కొనసాగనున్నారు.
-కొత్త కేంద్ర కేబినెట్ మంత్రుల పూర్తి జాబితా ఇదే..
1.జి. కిషన్ రెడ్డి
2.కిరెన్ రిజిజు
3.నారాయణ్ రాణే
4.సర్బానంద సోనోవాల్
5. డాక్టర్ వీరేంద్ర కుమార్
6.జ్యోతిరాదిత్య ఓం సింధియా
7. ఎ. నారాయణస్వామి
8. కౌషల్ కిషోర్
9. అజయ్ భట్
10. బి. ఎల్. వర్మ
11. అజయ్ కుమార్
12. చౌహాన్ దేవుసింగ్
13. భగవంత్ ఖుబా
14.రామ్‌చంద్ర ప్రసాద్ సింగ్
15 అశ్విని వైష్ణవ్
16 పశుపతి పరాస్
17 రాజ్ కుమార్ సింగ్
18 హర్దీప్ సింగ్ పూరి
19 మన్సుఖ్ మాండవియా
20 భూపేందర్ యాదవ్
21 పార్శోత్తం రూపాల
22 అనురాగ్ సింగ్ ఠాకూర్
23 పంకజ్ చౌదరి
24 అనుప్రియా సింగ్ పటేల్
25 డాక్టర్ సత్య పాల్ సింగ్ బాగెల్
26 రాజీవ్ చంద్రశేఖర్
27 శోభా కరండ్లజే
28 భాను ప్రతాప్ సింగ్ వర్మ
29 దర్శన విక్రమ్ జర్దోష్
30 మీనాక్షి లేకి
31 అన్నపూర్ణ దేవి
32 కపిల్ మోరేశ్వర్ పాటిల్
33 ప్రతిమ భూమిక్
34 డాక్టర్ సుభాస్ సర్కార్
35 డాక్టర్ భగవత్ కిషన్రావ్ కరాడ్
36 డాక్టర్ రాజ్‌కుమార్ రంజన్ సింగ్
37 డాక్టర్ భారతి ప్రవీణ పవార్
38 బిశ్వేశ్వర్ టుడు
39 శాంతను ఠాకూర్
40 డాక్టర్ ముంజపారా మహేంద్రభాయ్
41 జాన్ బార్లా
42 డాక్టర్ ఎల్. మురుగన్
4. నిసిత్ ప్రమానిక్